Manisha Koirala: ఆ స్టార్ నటులతో ఎఫైర్స్.. మొగుడే నా శత్రువు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మనీషా కొయిరాలా చాలా మందితో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు షికారు చేశాయి. చాలా మంది సెలబ్రిటీలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. చాల మంది హీరోలతో ప్రేమాయణం సాగించినా కూడా అవి పెళ్లివరకు దారి తీయలేదు. చివరకు మనీషా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది.

అప్పట్లో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న భామ మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు మనీషా కొయిరాలా. సినిమాల్లోనే కాదు బుల్లితెర కూడా సత్తా చాటింది మనీషా. కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ అమ్మడు ఎన్నో ఆటుపోట్లు చవి చూసింది. మనీషా కొయిరాలా చాలా మందితో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు షికారు చేశాయి. చాలా మంది సెలబ్రిటీలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. చాల మంది హీరోలతో ప్రేమాయణం సాగించినా కూడా అవి పెళ్లివరకు దారి తీయలేదు. చివరకు మనీషా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సంబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు.
2010లో మనీషా సామ్రాట్ దహల్‌ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లయిన ఆరు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో సామ్రాట్ దహల్, మనీషా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లయిన రెండు నెలలకే సామ్రాట్, మనీషా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, నటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలోని జరిగిన చేదు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ‘నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు..’ అంటూ విఫలమైన వివాహం గురించి తెలిపింది. అలాగే తన భర్తను తన శత్రువు అని తెలిపింది.
‘పెళ్లయిన ఆరు నెలల తర్వాత, నా భర్త నాకు శత్రువు అయ్యాడు. స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది…’ అనిచెప్పుకొచ్చింది.. లెజెండరీ నటుడు నానా పటేకర్‌తో కూడామనీషాకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే నానా పటేకర్‌కి అప్పటికే వెళ్ళింది. నానా పటేకర్‌తో పాటు, వివేక్ ముశ్రన్, డీజే హుస్సేన్, సిసిల్ ఆంథోనీ, ఆర్యన్ వేద్, ప్రశాంత్ చౌదరి, క్రిస్పిన్ కాన్రాయ్, తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ మూల్‌చందానీ మరియు క్రిస్టోఫర్ డోరిస్‌లతో మనీషాకొయిరాలా ప్రేమాయణం నడిపిందని గుసగుసలు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది మనీషా కొయిరాలా. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నది తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




