Jayalalitha: తండ్రిలాంటి ఆయనతో నాకు సంబంధం అంటగట్టారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి
చాలా సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించిన జయలలిత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్ లో నటిస్తూ బిజీగా మారిపోయారు. కానీ ఇప్పుడు ఆ సినిమాలకు కూడా గుడ్ బై చేశారు జయలలిత. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అలనాటి నటి జయలలిత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమెను అందరూ బోరింగ్ పాప అని పిలుస్తుంటారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు జయలలిత. ముఖ్యంగా వ్యాప్ పాత్రలతో క్రేజ్ తెచ్చుకున్నారు ఈ సీనియర్ నటి. చాలా సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించిన జయలలిత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్ లో నటిస్తూ బిజీగా మారిపోయారు. కానీ ఇప్పుడు ఆ సినిమాలకు కూడా గుడ్ బై చేశారు జయలలిత. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె సీరియల్స్ మానేయడానికి గల కారణాలు కూడా తెలిపారు జయలలిత.
ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంట్రవ్యూలో జయలలిత శరత్ బాబుతో ఉన్న అనుబంధం గురించి తెలిపిన విషయం తెలిసిందే. అలాగే తనకు నటుడు గుమ్మడికి ఉన్న అనుబంధం గురించి తెలిపింది. ఆయన తనకు తండ్రితో సమానం. కానీ ఆయనతో తనకు సంబంధం అంటగట్టారు అని తెలిపారు జయలలిత. గుమ్మడి గారు నాకు తండ్రిలాంటి వారు. రోజు ఉదయానే నాకు ఫోన్ చేసి ఏం వండుతున్నావ్.? అని అడిగేవారు.
మా బ్రతుకు మేము బతుకుతున్నాం.. నేను వాళ్లతో కలిసి తినడం, తాగడం, పేకాట ఆడటం చేసేవాళ్ళం.. అదంతా నా అదృష్టంగా భావించేదాన్ని.. నా కోసం ఓ ప్రత్యేక వైన్ బాటిల్ తెప్పించేవారు అని చెప్పుకొచ్చింది. నేను ఆయనకు పరిచయమైన తర్వాత ఆయన క్లబ్ కు కూడా వెళ్లేవారు కాదు అని తెలిపారు జయలలిత. నాలుగేళ్లు ఆయనతో కలిసి జర్నీ చేశాను. ఇప్పుడు ఆయన ఇంటివైపు వెళ్తే ఏడుపు వచ్చేస్తుంది అని తెలిపారు జయలలిత. ఆయన చనిపోయే ముందు చివర్లో ఆయన పక్కన ఉన్నది నేను. హాస్పిటల్ లో జాయిన్ చేసింది నేను. ఆయన పోవడం నాకు పెద్ద లోటు. ఆయన ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఆ రోజులు మళ్లీ తిరిగి రావు అంటూ ఎమోషనల్ అయ్యారు జయలలిత.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




