- Telugu News Photo Gallery Cinema photos Prasanth Varma Hanuman OTT to Ram Charan next films latest movie updates from Tollywood
Film Updates: హనుమాన్ ఓటిటి అందుకే ఆలస్యం.. చరణ్ బర్త్ డేకి ఆ అనౌన్స్‌మెంట్స్..
హనుమాన్ ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ వర్మ దీనికి కారణం తెలిపారు. పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు రాక చాలా కాలమైపోయింది. రామ్ చరణ్ పుట్టిన రోజును ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటుడిగానూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా కలియుగ పట్టణంలో.
Updated on: Mar 17, 2024 | 7:26 AM

హనుమాన్ ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ వర్మ దీనికి కారణం తెలిపారు. అనుకోని అవాంతరాల వల్ల ఆలస్యమవుతుందే తప్ప.. వేరే ఉద్దేశం లేదని.. త్వరలోనే శుభవార్త ఉంటుందని చెప్పుకొచ్చారు. హనుమాన్‌ను రెగ్యులర్ సినిమా స్కోప్ వెర్షన్‌లో కాకుండా RRR తరహాలో ఫుల్ ఐమ్యాక్స్ రేషియోలో ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్లే సాంకేతికంగా జాప్యం జరుగుతుందని తెలుస్తుంది.

పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు రాక చాలా కాలమైపోయింది. అయితే ఇప్పుడు ఈమెకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో పూజానే హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే గనక పూజా పంట పండినట్లే.

భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటుడిగానూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈయన కన్నడలో ప్రతినాయకుడిగా నటించిన ‘కెంపేగౌడ 2’ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘యమధీర’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ని ప్రముఖ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ విడుదల చేసారు.

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా కలియుగ పట్టణంలో. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ విడుదల చేసారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ ఈ పాటను రాసారు. కలియుగంలో జరుగుతున్న అరాచకాలకు అద్దం పట్టేలా ఇందులో లిరిక్స్ ఇచ్చారు చంద్రబోస్. దీనికి మంచి స్పందన వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.

రామ్ చరణ్ పుట్టిన రోజును ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ రోజు మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. మొదటిది గేమ్ ఛేంజర్ పాట విడుదల కాగా.. రెండోది బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్‌డేట్.. ఇక మూడోది సుకుమార్, రామ్ చరణ్ సినిమా ప్రకటన అని తెలుస్తుంది.




