AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: అమ్మబాబోయ్ బాలయ్య అన్ని రీమేక్ సినిమాలో నటించారా..! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ అదిరిపోయే లుక్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అలరించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య ఫుల్ బిజీగా గడపనున్నారు. బాబీ సినిమా తర్వాత బాలయ్య పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Nandamuri Balakrishna: అమ్మబాబోయ్ బాలయ్య అన్ని రీమేక్ సినిమాలో నటించారా..! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2024 | 3:54 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుత ఎన్బీకే 109. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ అదిరిపోయే లుక్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అలరించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య ఫుల్ బిజీగా గడపనున్నారు. బాబీ సినిమా తర్వాత బాలయ్య పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి అలరించారు.

అయితే బాలకృష్ణ ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారో తెలుసా.. తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవబుతుంది. రీమేక్ సినిమా చాలా మంది సూపర్ స్టార్ లకు బిగ్ బ్లాక్ బస్టర్స్ ను ఇచ్చాయి. అలాగే బాలకృష్ణ కు కూడా రీమేక్ సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చాయి. బాలయ్య చేసిన రీమేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బాలకృష్ణ రీమేక్ చేసిన మొదటి సినిమా నర్తనశాల.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమాను బాలకృష్ణ రీమేక్ చేశారు. కానీ సౌందర్య చనిపోవడంతో ఆ సినిమాను ఆపేశారు. ఎప్పటికైనా ఆ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. హాలీవుడ్ టోటల్ రీకాల్ అనే సినిమాను ఆధారంగా తీసుకొని లయన్ అనే సినిమా చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాను పాండురంగడుగా రీమేక్ చేశారు. ది బౌర్నే ఐడెంటిటి అనే సినిమా ఆధారంగా విజయేంద్రవర్మ అనే సినిమా చేశారు. తమిళ్ లో విక్రమ్ నటించిన సామిని లక్ష్మీనరసింహ గా రీమేక్ చేశారు. కన్నడలో రాజ నరసింహ సినిమాను తెలుగులో పల్నాటి బ్రహ్మనాయుడు గా రీమేక్ చేశారు. హిందీలో వచ్చిన హీరో నంబర్ 1 సినిమాకు రీమేక్ గా గొప్పింటి అల్లుడు చేశారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న శ్రీకృష్ణ పాండవీయం సినిమాను.. శ్రీ కృష్ణార్జున విజయం గా బాలయ్య రీమేక్ చేశారు. అలాగే పాతాళ భైరవి,  ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’లాంటి సినిమాల కథను ఆధారం చేసుకొని భైరవ ద్వీపం సినిమా చేశారు. అలాగే తంగమన రాసా’ సినిమాకు రీమేక్ గా ముద్దుల మేనల్లుడు, ఆర్యన్ సినిమాకు రీమేక్ గా అశోక చక్రవర్తి, ఎన్ తంగాచ్చి పడిచావా సినిమాకు రీమేక్ గా ముద్దుల మామయ్య, సీనియర్ ఎన్టీఆర్ రాముడు భీముడు, అరువదై నాల్ సినిమా మువ్వగోపాలుడు గా రీమేక్ చేశారు. పెర్ సొల్లుమ్ పిళ్లై’ – రాము, ఖయామత్ -నిప్పులాంటి మనిషి, వద్దంటే డబ్బు- బాబాయి అబ్బాయి, కర్జ్ – ఆత్మబలం, మన్ వాసనై -మంగమ్మగారి మనవడు , డిస్కో డాన్సర్- డిస్కో కింగ్, ఆషా – అనురాగదేవత, ఎన్టీఆర్ వేంకటేశ్వర మహాత్యం- శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, నర్తనశాల-శ్రీ మద్విరాట పర్వము, ‘మెఘల్ – ఏ – ఆజం -అక్బర్ సలీం అనార్కలి, యాదోంకి బారాత్- అన్నదమ్ముల అనుబంధం ఇలా చాల రీమేక్స్ బాలయ్య నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..