AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Kishan: మా నాన్నే నన్ను చంపాలని చూశాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రేసుగుర్రం విలన్

మద్దాలి శివ రెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. రేసుగుర్రం సినిమాతో రవి కిషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ఆయన చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఎంపీగా సేవలందిస్తున్నాడు.

Ravi Kishan: మా నాన్నే నన్ను చంపాలని చూశాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రేసుగుర్రం విలన్
Ravikishan
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2024 | 3:13 PM

Share

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. శ్రుతిహాసన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే ఈ సినిమాలో భోజ్ పూరి నటుడు రవికిషన్ విలన్ గా నటించాడు. మద్దాలి శివ రెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. రేసుగుర్రం సినిమాతో రవి కిషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ఆయన చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఎంపీగా సేవలందిస్తున్నాడు. తాజాగా ఆయన తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా రవి కిషన్ మాట్లాడుతూ.. మా నాన్నకు కోపం ఎక్కుక్కువ.. నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడు. చావబాదేవాడు.. సింపుల్ గా చెప్పాలంటే చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు అని అన్నారు రవికిషన్. ఒక రోజు నన్ను చంపాలని చూశారు. దాంతో మా అమ్మ నన్ను పారిపొమ్మని చెప్పింది. దాంతో వెంటనే నేను 500 జేబులో పెట్టుకొని ముంబై ట్రైన్‌ ఎక్కాను అని తెలిపారు రవికిషన్.

మా నాన్న కోపంలో కారణం ఉంది అని తెలిపారు రవికిషన్. మా నాన్న ఒక పూజారి. తనలానే తన కొడుకు కూడా పూజారి అవ్వాలని అనుకున్నారు. పూజారి కాకపోతే.. వ్యవసాయం, లేదా ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలని ఆశపడ్డారు. ఆయన కుటుంబంలో ఒక నటుడు పుడతాడని అనుకోలేదు. ఒకసారి నేను సీత గెటప్ లో డాన్స్ చేస్తూ మా నాన్నకు కనిపించాను. అప్పుడు నన్ను చావ బాదాడు. ఆయన కొట్టిన దెబ్బలే నాకు జీవితం అంటే ఏంటో నేర్పించాయి. ఇప్పుడు రవికిషన్ ఇలా మీ ముందు నిలుచున్నా .. నేను నటుడు అయిన తర్వాత చాలా గర్వపడ్డారు. చనిపోయేముందు కూడా నిన్ను చూసి గర్వపడుతున్నా అని చెప్పారు అని రవికిషన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?