నోరా ఫతేహి నుంచి బాద్షా వరకు.. టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవంలో తళుక్కున మెరవనున్న తారలు వీళ్లే..!
T20 World Cup Opening Ceremony: టీ20 ప్రపంచకప్ 2026 నేటి నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. అయితే, ప్రారంభోత్సవ వేడుకలు మాత్రం ముంబైలో సాయంత్రం 6 గంటలకు జరగనున్నాయి. భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్ కు ముందు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.

T20 World Cup Opening Ceremony 2026: Nora Fatehi to Badshah – Full Stars List: 2026 టీ20 ప్రపంచ కప్ నేటి నుంచి అంటే ఫిబ్రవరి 7, శనివారం నుంచి మొదలుకానుంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంకలో జరగనుంది. అలాగే, భారతదేశంలో స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే, భారత జట్టు కూడా టోర్నమెంట్ తొలి రోజు నుంచి బరిలోకి దిగనుంది. అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడేందుకు సూర్యకుమార్ సేన సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరగనుంది. టీమిండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అక్కడే టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.
ఈ వేడుకలు సాయంత్రం 6:00 గంటలకు జరగనున్నాయి.ఆ తరువాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. రిషబ్ శర్మ, శివమణిల సంగీతంతో ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఆ తరువాత టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొస్తారు. ఈ ట్రోఫీ వేడుకలో ఓ స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. అదే రోహిత్ శర్మ.
ట్రోఫీ తీసుకురానున్న రోహిత్ శర్మ..
టోర్నమెంట్ ట్రోఫీని ఐసీసీ చైర్మన్ జై షా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకొస్తారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 2024 ఎడిషన్‌లో టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిని కాపాడుకునే బాధ్యత సూర్యకుమార్ యాదవ్‌పై ఉంది. రోహిత్ శర్మతోపాటు ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 20 మంది పిల్లలతో కలిసి 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించనున్నాడు.
ట్రోఫీ ఆవిష్కరణ తర్వాత అభిమానుల జోష్ మరింత రెట్టింపు చేసేందుకు ఐసీసీ, బీసీసీఐ భారీగానే ప్లాన్ చేసింది. అద్భుతమైన పాటలతోపాటు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది. ఇందులో స్టార్ బాద్షా ప్రదర్శన, నోరా ఫతేహితోపాటు అనేక మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. చివర్లో బాణసంచా పేల్చనున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు ఇండియా వరసెస్ యూఎస్ఏ మ్యాచ్ మొదలుకానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
