Gajala: ఓర్నీ..! హీరోయిన్ గజాల ఇలా మారిపోయిందేంటీ..! నిజంగా అవాక్ అవ్వాల్సిందే
ఈ ముద్దుగుమ్మ చాలా మంది కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గజాల. స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడులాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. గజాల ఎక్కువ సినిమాలు చేయకపోయినా మంచి క్రేజ్ మాత్రం సొంతం చేసుకుంది. కానీ ఈ చిన్నది సినిమాలనుంచి దూరం అయ్యింది

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను అలరించి ఆతర్వాత అనూహ్యంగా కనిపించకుండా మాయం అవుతుంటారు. సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్స్ కూడా చాలా మంది కనుమరుగయ్యారు. పైన ఉన్న హీరోయిన్ కూడా అలానే అభిమానులకు షాక్ ఇచ్చి మాయం అయ్యింది. ఆమె గజాల.. ఈ ముద్దుగుమ్మ చాలా మంది కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గజాల. స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడులాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. గజాల ఎక్కువ సినిమాలు చేయకపోయినా మంచి క్రేజ్ మాత్రం సొంతం చేసుకుంది. కానీ ఈ చిన్నది సినిమాలనుంచి దూరం అయ్యింది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో చిన్న పాత్రలో నటించింది.
అయితే గజాల 2002లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. చావు వరకు వెళ్లి బయటపడింది గజాల. జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ఓ హోటల్ లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె ప్రెండ్స్ సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె బ్రతికి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఆతర్వాత అడపా దడపా సినిమాలు చేసింది ఈ చిన్నది. తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.
ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది. ఏం చేస్తుంది అన్నది తెలుసుకోవడానికి చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గజాల ఇప్పుడు చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా ఈ చిన్నది చేంజ్ అయ్యింది.

గజాల ఫెస్ బుక్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




