Rana Naidu: రానా నాయుడులో నటించిన ఈ బోల్డ్ బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటీ.!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్‌లో నటించారు వెంకటేష్, రానా. అయితే ఈ సిరీస్  బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈవెబ్ సిరీస్‌ను తెలుగులో తొలగించారు. అయితే వెంకటేష్ ఇలా బోల్డ్ కంటెంట్ లో నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు.

Rana Naidu: రానా నాయుడులో నటించిన ఈ బోల్డ్ బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటీ.!
Rana Naidu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2024 | 8:42 AM

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రామానాయుడు. ఈ వెబ్ సిరీస్  తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్‌లో నటించారు వెంకటేష్, రానా. అయితే ఈ సిరీస్  బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈవెబ్ సిరీస్‌ను తెలుగులో తొలగించారు. అయితే వెంకటేష్ ఇలా బోల్డ్ కంటెంట్ లో నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న వెంకీ.. ఈ సిరీస్ లో నటించడం పై కొందరు విమర్శలు చేశారు. అయితే బాలీవుడ్ లో ఈ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రానుంది. ఇదిలా ఉంటే రానా నాయుడు సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది . ?

రామానాయుడు సిరీస్ లో చాలా మంది బాలీవుడ్ నటులు కూడా నటించారు. అలాగే ఈ సిరీస్ లో రానాతో ఎఫైర్ పెట్టుకోవాలని ఓ యువతి ప్రయతినిస్తుంది. ఈ ఇద్దరి మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంతకూ ఆమె ఎవరంటే.. ప్రియా బెనర్జీ. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ప్రియా బెనర్జీ బోల్ట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

కెనడాలో పుట్టిన ఈ భామ తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అడవి శేష్ హీరోగా నటించిన కిస్ అనే సినిమాతో ప్రియా బెనర్జీ పరిచయం అయ్యింది. ఆతర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన జోరు అనే సినిమాలో చేసింది. అలాగే నారా రోహిత్ నటించిన అసుర సినిమాలోనూ చేసింది. ఇక్కడ హిట్స్ రాకపోవడమతొ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా సినిమాల్లో సక్సెస్ కాలేకపోయింది. దాంతో వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రతీక్ బబ్బర్‌ తో రిలేషన్ లో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి