Panjaa: పంజా హీరోయిన్ ఎంతలా మారిపోయిందేంటీ..! చూస్తే షాక్ అవ్వాల్సిందే

పవన్  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా దేశ వ్యాప్తంగా పవన్ కు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవర్ స్టార్. అలాగే పవన్ నాలుగు సినిమాలను లైనప్ చేశారు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్స్ ను పూర్తి చేయనున్నారు.

Panjaa: పంజా హీరోయిన్ ఎంతలా మారిపోయిందేంటీ..! చూస్తే షాక్ అవ్వాల్సిందే
Panja Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 06, 2024 | 6:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎలా ఉన్న పవన్ కళ్యణ్‌ను చూడటానికి ప్రేక్షకులు ఎగబడతారు. పవన్  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా దేశ వ్యాప్తంగా పవన్ కు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవర్ స్టార్. అలాగే పవన్ నాలుగు సినిమాలను లైనప్ చేశారు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్స్ ను పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఫ్యాన్స్ లో ఉత్సహాన్ని పెంచేసిన సినిమాల్లో పంజా సినిమా ఒకటి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూస్ అందుకుంది.

ఈ సినిమాలో పవన్ నటనతో ఆయన లుక్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ గుర్తున్నారా.? వారిలో ఓ ముద్దుగుమ్మ పేరు సారా జేన్ డయాస్. పంజా సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సారా జేన్ కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించింది. కానీ పంజా మూవీ తర్వాత సారా తెలుగులో మరిన్ని సినిమాలు చేయలేదు.

కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించని సారా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు దగ్గరగా ఉంటుంది. సారా మన దేశ అమ్మాయి కాదు. ఒమన్ దేశానికి చెందిన బ్యూటీ ఈ అమ్మడు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది సారా జేన్ డయాస్. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. చూస్తే అవాక్ అవ్వాల్సిందే. తాజాగా సారా జేన్ డయాస్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Panja Movie Actress

Panja Movie Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.