Nithiin: తండ్రైన నితిన్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని
నితిన్ 2020లో వివాహం చేసుకున్నాడు. తన స్నేహితురాలు షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 2020 జులై 26న వివాహం చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్‌ల కూతురు షాలిని.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యాడు. హీరోగా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నితిన్ 2020లో వివాహం చేసుకున్నాడు. తన స్నేహితురాలు షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 2020 జులై 26న వివాహం చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్‌ల కూతురు షాలిని. ఇప్పుడు ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనించింది. ఈ విషయం తెలిసి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నితిన్ జయం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.
సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు నితిన్. ఒకానొక సమయంలో నితిన్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్ వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. ఆతర్వాత ఇష్క్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు.
ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి భీష్మ అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.