Bigg Boss 7 Telugu: నయని పావని ఉన్నది వారమే.. కానీ రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే అందుకుందిగా..
అలాంటి వారిలో నయని పావని ఒకరు. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. టిక్ టాక్ వీడియోలు.. ఆ తర్వాత ఇన్ స్టార్ గ్రామ్ రీల్స్ తో నెటిజన్స్ ను మెప్పించింది. చూడటానికి హీరోయిన్ లా ఉండే ఈ బ్యూటీ తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది. గ్లామరస్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది నయని పావని.

సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎందుకు క్రేజ్ సొంతం చేసుకుంటున్నారో తెలియడం లేదు. ఇక మరోకొంత మంది తమ ట్యాలెంట్ అంతా చూపించి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో నయని పావని ఒకరు. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. టిక్ టాక్ వీడియోలు.. ఆ తర్వాత ఇన్ స్టార్ గ్రామ్ రీల్స్ తో నెటిజన్స్ ను మెప్పించింది. చూడటానికి హీరోయిన్ లా ఉండే ఈ బ్యూటీ తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది. గ్లామరస్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది నయని పావని. ఎంట్రీనే తన ఒంపుసోపులతో అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది నయని పావని. ఇక బిగ్ బాస్ లో ఈ చిన్నది ఉన్నది వారమే..
నయని పావని బిగ్ బాస్ హౌస్ లో బాగానే సందడి చేసింది. కానీ వారం రోజులకే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిజానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారిలో అర్జున్ తర్వాత నయని పావని ఎనర్జిటిక్ గా ఉంటుంది. టాస్క్ ల్లోనూ బాగానే పర్ఫామ్ చేసింది కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది.
నిన్న (ఆదివారం) జరిగిన ఎపిసోడ్లో నామినేషన్స్ లో ఉన్న వారిలో నయని పావనికి తక్కువ ఓట్లు రావడంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. దాంతో బోరున ఏడ్చింది నయని పావని. ఇప్పటివరకు ఇంతలా ఏడ్చిన వారిలో గీతూ రాయల్ తరవాత ఈ చిన్నదే అని చెప్పాలి. అంతలా వెక్కి వెక్కి ఏడ్చేసింది నయని పావని. ఇక ఈ చిన్నది ఉన్నది వారం రోజులే అయిన.. రెమ్యునరేషన్ మాత్రం బాగానే అందుకుందని తెలుస్తోంది. వారం రోజులకు గాను నయని పావని ఏకంగా 2 లక్షల అందుకుందని తెలుస్తోంది. నయని పావని వారం రోజులకే బయటకు రావడంతో ఆమె అభిమానులు చాలా నిరాశపడ్డారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.