AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirapakay: బాబోయ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిరపకాయ్ భామ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా బెడిసికొట్టింది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇదే హరీష్ శంకర్ రవితేజకు మిరపకాయ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇచ్చారు. 2011లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Mirapakay: బాబోయ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిరపకాయ్ భామ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
Richa Gangopadhyay
Rajeev Rayala
|

Updated on: Oct 05, 2024 | 11:26 AM

Share

మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా బెడిసికొట్టింది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇదే హరీష్ శంకర్ రవితేజకు మిరపకాయ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇచ్చారు. 2011లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో రవితేజ పోలీస్ ఆఫిసర్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీలో రవితేజ సరసన ఇద్దరు బామలు నటించారు. రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా చేశారు.

ఈ ఇద్దరు భామలు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిలో రిచా గంగోపాధ్యాయ బాగా క్లిక్ అయ్యింది. ఈ భామకు మిరపకాయ్ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడు మిరపకాయ్ కంటే ముందు రానా దగ్గుబాటి అరంగేట్రం చేసిన లీడర్‌ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. రిచా గంగోపాధ్యాయ లీడర్ తర్వాత మిరపకాయ్‌, మిర్చి, నాగవల్లి, భాయ్‌, సారొచ్చారు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

ప్రభాస్‌ హీరోగా నటించిన మిర్చి సినిమాలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు కొన్ని తమిళం, బెంగాలీ సినిమాల్లోనూ సందడి చేసింది ఈ అందాల తార. సినిమా కెరీర్‌ పరంగా పీక్స్‌ దశలో ఉండగానే అమెరికాకు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ జో లాంగేల్లా అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో కలిసి ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ భామ ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

Follow Us
రెస్టారెంట్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై.. ఈ చిట్కాలు పాటిస్తే వంట హిట్టే
రెస్టారెంట్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై.. ఈ చిట్కాలు పాటిస్తే వంట హిట్టే
OTTని ఊపేస్తోన్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ...
OTTని ఊపేస్తోన్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ...
మీకు పెళ్లి అయిందా? అయితే ఓ గుడ్‌న్యూస్‌!
మీకు పెళ్లి అయిందా? అయితే ఓ గుడ్‌న్యూస్‌!
తలస్నానం చేసే 5 నిమిషాల ముందు ఈ చిన్న పని చేయండి
తలస్నానం చేసే 5 నిమిషాల ముందు ఈ చిన్న పని చేయండి
సోలార్‌ ఏసీ గురించి మీకు తెలుసా? ఇలా చేస్తే మీ ఏసీ బిల్లు జీరో..!
సోలార్‌ ఏసీ గురించి మీకు తెలుసా? ఇలా చేస్తే మీ ఏసీ బిల్లు జీరో..!
ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?ఈ రూల్స్ పాటించాల్సిందే
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?ఈ రూల్స్ పాటించాల్సిందే
సబ్జా నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
సబ్జా నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీరు తింటున్న కోడిగుడ్డు మంచిదేనా? ఇలా ఈజీగా కనిపెట్టేయండి..!
మీరు తింటున్న కోడిగుడ్డు మంచిదేనా? ఇలా ఈజీగా కనిపెట్టేయండి..!
చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే..
చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే..