Varudu: వరుడు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవుతారు
పైన కనిపిస్తోన్న హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లో ఉంది. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా గుర్తుందా..? గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా మాయమైన వారు ఉన్నారు. ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తోన్న హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లో ఉంది. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా గుర్తుందా..? గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఐదురోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో ఆర్య నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి అప్పట్లో గట్టిగానే చర్చ జరిగింది. ఆ హీరోయిన్ పేరు భాను శ్రీ . ఈ సినిమాలో ఆమె ను చాలా సేపు సస్పెన్స్ లో ఉంచి చూపించారు గుణశేఖర్.
అయితే అంత సస్పెన్స్ కూడా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత భాను శ్రీకి ఆశించిన స్థాయిలో క్రేజీ ఆఫర్స్ రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ కనిపించింది. వరుడు కంటే ముందు ఈ భామ బాలీవుడ్ చిత్రం బచ్నా ఏ హసీనోలో అతిధి పాత్రలో నటించింది.
తెలుగులో చిల్కూరు బాలాజీ , ప్రేమతో చెప్పన , మహారాజా శ్రీ గాలిగాడు , లింగడు-రామలింగడుతో సహా అనేక తెలుగు ప్రాజెక్టుల్లో నటించింది. 10వ తరగతి డైరీలు అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.. ఎక్కడ ఉంది అని నెటిజన్లు గాలిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ అదే అందంతో కవ్విస్తోంది ఈ చిన్నది.
View this post on Instagram
