AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్యను ఎప్పుడైనా చూశారా.. కుందనపు బొమ్మే

బుల్లితెరపై కమెడియన్‌గా కనిపించిన మహేష్‌.. సిల్వర్‌ స్క్రీన్ మీద నటుడిగా తన సత్తా చాటుకున్నారు. కామెడీతో నవ్వించడమే కాదు.. ఎమోషనల్‌ సీన్స్‌లో నటించి అందర్ని ఏడిపించగలరు. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనూ అవలీలగా చేయగలడు. అలా విభిన్న పాత్రలతో ఆడియెన్స్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు మహేష్‌.

Mahesh Achanta: 'రంగస్థలం' మహేష్ భార్యను ఎప్పుడైనా చూశారా.. కుందనపు బొమ్మే
Mahesh Achanta
Ram Naramaneni
|

Updated on: Apr 15, 2024 | 3:11 PM

Share

మ‌హేష్ అచంట అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. రంగస్థలం మహేష్ అంటే చాలామంది గుర్తుపడతారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేష్… సినిమాల్లో క‌మెడియ‌న్‌గా, కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ.. మంచి యాక్టర్‌గా ముందుకు సాగుతున్నాడు. అయితే నటుడిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు మహేష్. సినిమా ఆఫీసులు ఎంత దూరంలో ఉన్న నడుస్తూ వెళ్లేవాడు. తండ్రి చనిపోయినప్పుడు అతని వద్ద 10 రూపాయలు కూడా లేవు. జ‌బ‌ర్ద‌స్త్ షోలో వేషాల కోసం పడిగాపులు కాసేవాడు. ష‌క‌ల‌క శంక‌ర్‌.. తొలుత అతడిని జ‌బ‌ర్ద‌స్త్‌ స్టేజ్ ఎక్కించాడు. అలా జ‌బ‌ర్ద‌స్త్‌లో కనపడుతూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. 2017లో దర్శకుడు సుకుమార్‌ రంగ‌స్థ‌లంలో అవ‌కాశం ఇచ్చిన త‌ర్వాత.. అతడి ఫేట్ మారిపోయింది. ఆ చిత్రంలో చిట్టిబాబు స్నేహితుడిగా నటించి.. విపరీతమైన గుర్తింపు పొందాడు. మహేష్ స్కిల్ అందరికీ తెలియడంతో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. శతమానం భవతి, మహానటి చిత్రాలతో నటుడిగా స్థిరపడిపోయాడు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, నటుడు విశ్వక్ సేన్ వంటి వాళ్లు మహేష్‌ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మంచి పారితోషకం అందుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు మహేష్. అయితే తన ఎదుగుదలను తండ్రి చూడలేకపోయాడు అనే బాధ అతడిలో ఉంది.

తన సమీప బంధువుల అమ్మాయి పావనిని 2020 లాక్‌డౌన్ సమయంలో వివాహమాడాడు మహేష్. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2021లో ఓ ఆడబిడ్డ జన్మించింది. కాగా మహేష్ భార్య పావని కూడా కుందనపు బొమ్మలా.. ఎంతో పద్దతిగా ఉంటుంది. ఈ కపుల్ లేటెస్ట్‌ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ. తను కూడా మంచి నటి అవ్వొచ్చు. ట్రై చేస్తే అని కామెంట్స్ పెడుతున్నారు ఆమెను చూసిన నెటిజన్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.