Jr. NTR: బాలీవుడ్ బ్యూటీతో యంగ్ టైగర్.. తారక్ లుక్ అదిరిందిగా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెరిసింది ఈ అమ్మడు.. అలాగే అఖిల్ ఏజెంట్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఊర్వశి రౌతేలాసోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్న సోషల్ మీడియాలో తన ఫొటోలతో వీడియోలతో సెగలు పెట్టిస్తుంది.

నటి ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లోనూ అలరిస్తుంది. స్పెషల్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెరిసింది ఈ అమ్మడు.. అలాగే అఖిల్ ఏజెంట్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఊర్వశి రౌతేలాసోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్న సోషల్ మీడియాలో తన ఫొటోలతో వీడియోలతో సెగలు పెట్టిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది ఊర్వశి. ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ చూసిన ఈ ఫోటో గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ఆ ఫోటో ఏంటంటే..
ఊర్వశి రౌతేలా జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ అమ్మడు తారక్ తో ఎందుకు ఫోటో దిగింది. క్యాజువల్ గా కలిసిందా.? లేక వార్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందా.? అన్న ప్రశ్నలు తారక్ ఫ్యాన్స్ మదిలో మెదులుతున్నాయి.
‘జూనియర్ ఎన్టీఆర్ మనందరికీ నచ్చే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. అతను చాలా క్రమశిక్షణ, నిజాయితీ , ముక్కుసూటి వ్యక్తి. చాలా వినయంగా కూడా.. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీ సింహం లాంటి వ్యక్తిత్వం ప్రశంసనీయం. రాబోయే రోజుల్లో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం తారక్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ఈ సినిమాలో తారక్ హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకోసం తారక్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఊర్వశి రౌతేలా ఆయనను కలిశారని తెలుస్తోంది. ఇంతకాలం తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఊర్వశి రౌతేల ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇది బాలయ్యకు 109వ సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
ఊర్వశి రౌతేలా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




