AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Train: దేశ చరిత్రలో సరికొత్త శకం.. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం నేడే.. వావ్.. ఇన్ని ప్రత్యేకతలా..?

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. రైల్వే చరిత్రలో తొలిసారిగా హైడ్రోజన్ రైలు నేడు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల మీదగా దీనిని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ రైలు కోసం ప్రయాణికులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన..

Hydrogen Train: దేశ చరిత్రలో సరికొత్త శకం.. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం నేడే.. వావ్.. ఇన్ని ప్రత్యేకతలా..?
Hydrogen Train
Venkatrao Lella
|

Updated on: Jul 17, 2026 | 7:58 AM

Share

ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులను మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ తొలి కార్యక్రమం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు జరగనుంది. జింద్‌లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనుండగా.. ఈ సందర్భంగా ఇక్కడ నుంచి దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును పచ్చజెండా ఊపి తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జింద్-సోనిపట్ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటివరకు హైడ్రోజన్ రైళ్లు లేవు. దీంతో ఇదే తొలి ట్రైన్‌గా చెప్పవచ్చు. స్వదేశీ టెక్నాలజీతో భారత్‌లోనై ఈ రైలును తయారుచేశారు. ఈ రైలు నుంచి ఎలాంటి హనికరమైన పొగ రిలీజ్ అవ్వదు. దీంతో పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను తీసుకురానున్నారు.

రెండు కొత్త  రైలు సర్వీసులు ప్రారంభం

అయితే ఈ పర్యటన సందర్భంగా కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక చండీగఢ్‌లో రూ.6,600 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనుండగా.. పీజీఐఎంఈఆర్‌లో కొత్త కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇక ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ హైవేను జాతికి అంకితం చేయనుండగా.. 75 అమృత్ సర్ భారత్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. మంగళగిరి, రాయనపాడుతో పాటు కంబం రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారు. అలాగే కర్టోలి–అంబాలా, అమృత్‌సర్ (ఛెహర్తా)–వారణాసి మధ్య కొత్త రైలు సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..

జింద్- సోనిపత్ మధ్య రెండు రౌండ్ ట్రిప్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 356 కిలోమీటర్లు సర్వీసులు అందించనుంది. గంటకు 75 కి.మీ నుండి 120 కి.మీ. వరకు సామర్థ్యంతో నడవనుంది. జింద్ సిటీ, పాండు పిండార, లలిత్ ఖేరా, భంబేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రభ్ర, లాత్, మోహనా (హర్యానా), బర్వాస్ని, సోనిపట్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో సహా మొత్తం 10 కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2600 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. ఈ కోచ్‌లు చాలా లగ్జరీగా ఉంటాయి. అయితే కేవలం నాన్ ఏసీ కోచ్‌లు మాత్రమే ఇందులో ఉంటాయి. ప్రపంచంలో ఇతర దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉండగా.. ఇంత పొడవైన రైలు ఎక్కడా లేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తున్న దేశంగా భారత్ నిలవనుంది. రైల్వే రంగంలో ఇది సరికొత్త విప్లవంగా చెప్పవచ్చు.

Follow Us