AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన జారీ చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్..
Rains
Venkatrao Lella
|

Updated on: Jul 17, 2026 | 6:56 AM

Share

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో జులై 17వ తేదీన వానలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తాజాగా వెదర్ బులిటెన్ విడుదల చేసింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం ఏపీలో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

కొన్ని జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు మళ్లీ మొదలయ్యాయి. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కబోతతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ చల్లని కబుకరు అందించింది. వర్షసూచన జారీ చేయడంలో ఊరట చెందుతున్నారు. ఇక అల్పపీడనంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తరాంధ్ర విషయానికొస్తే.. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో వానలు పడనుండగా.. రాయలసీమలోని అనంతపురంలో తేలికపాటి వానలకు అవకాశముందని అంచనా వేసింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని, దీంతో ప్రజలు చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని సూచించింది. తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లవవద్దని హెచ్చరించింది.

తెలంగాణకు కూడా వర్షసూచన

అటు గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. పలాసలో 1.6 సె.మీ, పాతపట్నంలో 1.1 సెంటీమీటర్లు, మందసలో 1.8 సె.మీ వర్షపాతం రికార్డ్ అయినట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇక నంద్యాల, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడ్డాయి. అటు తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గురువారం సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురవగా.. హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం పలు ఏరియాల్లో వాన పడింది. మొన్నటివరకు తెలంగాణలో ఎండలు దంచికొట్టాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఎండాకాలాన్ని తలపించింది. ఇప్పుడు వర్ష ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి.

Follow Us