AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్ల ప్రేమ నిరాకరణ.. యువతి సూసైడ్‌..! ‘మృతదేహానికైనా తాళి కట్టాల్సిందే..’

8 ఏళ్లుగా కొనసాగిన ప్రేమ బంధం విషాదాంతానికి దారితీసింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతదేహంతో యువకుడి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు.. యువకుడే తమ కుమార్తె మరణానికి కారణమని ఆరోపిస్తూ, డెడ్‌ బాడీకి తాళి కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అతడు తాళికట్టిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సంచలనం రేపింది..

8 ఏళ్ల ప్రేమ నిరాకరణ.. యువతి సూసైడ్‌..! 'మృతదేహానికైనా తాళి కట్టాల్సిందే..'
Software Engineer Ends Life After Boyfriend Rejects Marriage
Srilakshmi C
|

Updated on: Jul 17, 2026 | 6:25 AM

Share

టంగుటూరు, జులై 17: టంగుటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగళ్ల కీర్తి (24) ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన పాపినేని సాయితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ప్రస్తుతం సాయి ఖతార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తమ ఉద్యోగాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తరచూ కలుసుకుంటూ వచ్చారు.

అయితే ఇటీవల సాయి కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తననే వివాహం చేసుకోవాలని సాయిని కోరగా, ఈ అంశంపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని కీర్తి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు సాయి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఒంగోలులోని సాయి బంధువుల ఇంట్లో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగినప్పటికీ, సాయి వివాహానికి అంగీకరించకపోవడంతో కీర్తిని ఓదార్చి తిరిగి ముంబైకి పంపించారు.

ఇవి కూడా చదవండి

ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి జూలై 14న తన తల్లిదండ్రులకు కాన్ఫరెన్స్ కాల్ చేసింది. ఆ కాల్‌లో సాయి కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన మరణానికి సాయే కారణమని చెబుతూ, తాను నివసిస్తున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, సాయి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. గదిలోకి వెళ్లి చూడగా కీర్తి ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, సాయి ఖతార్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కీర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబై నుంచి నేరుగా పొందూరులోని సాయి ఇంటి వద్దకు తీసుకువచ్చారు. సాయి మోసం చేయడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ, ఆమె చివరి కోరిక మేరకు సాయితో తాళికట్టించి అతడే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు కుటుంబాలతో పాటు గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. సాయి ఖతార్ నుంచి రావడానికి సమయం పడుతుందని, తమ కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహిస్తామని అతడి బంధువులు తెలిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పొందూరులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us
పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే..
పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే..
లోన్‌లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్‌.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్
లోన్‌లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్‌.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. విచారణలో బయటపడ్డ నిజం
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. విచారణలో బయటపడ్డ నిజం
నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
పిల్ల బచ్చా కాదు.. పులి పంజా!
పిల్ల బచ్చా కాదు.. పులి పంజా!
పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా?
పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా?
తల్లిదండ్రులను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఫలించకపోవడంతో
తల్లిదండ్రులను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఫలించకపోవడంతో
తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?
తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?
ఈ రాశుల జంటలు విడిపోవడం కష్టమే.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా..
ఈ రాశుల జంటలు విడిపోవడం కష్టమే.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా..
నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది
నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!