AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచన

COVID-19 Cases: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడటంతో, కరోనావైరస్ తిరిగి రావడం, మళ్లీ లాక్‌డౌన్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళనను ప్రజలలో మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అయితే, ప్రజలు..

COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచన
Covid 19
Subhash Goud
|

Updated on: Jul 16, 2026 | 9:40 PM

Share

COVID-19 Cases: ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. జూన్‌ 26 నుంచి12 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కడప,గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొవిడ్‌ పాజిట్‌తో నలుగురు మృతి చెందారు. ఒకే ప్రాంతంలో క్లస్టర్‌గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నలుగురు మృతి చెందగా, వారందరికీ ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలు పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం.

ప్రస్తుతం ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు పాటించాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యులు, ఆసుపత్రులను అప్రమత్తం చేశామని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని, దేశంలో అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

అయితే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడటంతో, కరోనావైరస్ తిరిగి రావడం, మళ్లీ లాక్‌డౌన్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళనను ప్రజలలో మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యుల, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..