జూలై 17 రాశిఫలాలు: ఉద్యోగం, డబ్బు, అదృష్టం కలిసి వచ్చే రాశులివే..?
Horoscope Today (July 17, 2026): శుక్రవారంనాడు మేష రాశి వారికి కుటుంబంలో శుభ పరిణామాలు, వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు, మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి యోగం కనిపిస్తోంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం వంటి అంశాల్లో ఈరోజు గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

దిన ఫలాలు (జూలై 17, 2026): మేష రాశి వారి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన బాకీలు, బకాయిలు వసూలవుతాయి. మిథున రాశి వారికి ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారపరంగా రాబడి బాగా పెరుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. పిల్లల విద్యా విషయాల మీద శ్రద్ధ పెడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. శ్రమకు తగ్గట్టుగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన బాకీలు, బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులు తమకు అందివచ్చిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని చాలావరకు తగ్గించుకుంటారు. దూర ప్రయాణాలు విజయ వంతం అవుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు ఆందోళనకర వార్తలు వినడం జరుగుతుంది. ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవు తాయి. కుటుంబ పెద్దల నుంచి కొద్దిగా సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. రోజంతా మీ ఇష్ట ప్రకారమే సాగిపోతుంది. విందు కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను, సహోద్యోగుల్ని మీ పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు బాగా పుంజుకుం టాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడ తారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఇష్ట మైనవారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని కొద్ది శ్రమతో పూర్తి చేయడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. బాగా అదృష్టదాయకమైన రోజు ఇది. కొన్ని వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుంటారు. కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చురుకుగా కార్యకలాపాలన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు పరిష్కారమవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిం చడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు మిత్రుల వల్ల బాగా లాభపడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వ్యక్తిగత కార్యకలాపాలతో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలు, ఆలస్యాలు, ఒత్తిడి వంటివి తప్పకపోవచ్చు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వా మితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యో గంలో అధికారుల నుంచి ఆదరణ, పోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరు గుతుంది. కొత్త వ్యాపారాల మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు వృద్ది చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఒకటి రెండు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఎదురు చూస్తున్న ఆశించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగు తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానం సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్త వుతాయి. మానసికంగా ఊరట లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమ వుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా చిన్నా చితకా సమస్యలున్నా వాటిని తేలికగా అధి గమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు హ్యాపీగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
Also Read: రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!



