Gold Prices Today: వావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?
గత కొంతకాలం నుంచి బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.. ఈ క్రమంలోనే.. ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు.. తగ్గుముఖం పట్టాయి.. ఇరాన్ - అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి ధరలు.. తగ్గుముఖం పట్టాయి.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. బుధవారం పెరిగిన ధరలు.. గురువారం తగ్గాయి.. ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.300 మేర ధర తగ్గింది. జులై 17 గురువారం పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,43,280 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 తగ్గి.. రూ.1,31,340 గా ఉంది.
వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.2,34,900 లు గా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,280, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,280, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,340 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,430, 22 క్యారెట్ల ధర రూ.1,31,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,280, 22 క్యారెట్ల ధర రూ.1,31,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,450, 22 క్యారెట్ల ధర రూ.1,31,490 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,280, 22 క్యారెట్ల ధర రూ.1,31,340 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
