July 16, 2026
Subhash
ఆరోగ్యకరమైన జీవితానికి రోజూ 7 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్రలేమి కేవలం అలసట మాత్రమే కాదు.. శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు చురుకుదనం కోల్పోతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి మందగించడం, రోజువారీ పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిద్రలేమి వల్ల రక్తపోటు (Blood Pressure) పెరిగే అవకాశం ఉంది. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగించి, భవిష్యత్తులో గుండెపోటు లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
నిద్ర తక్కువైతే ఆకలిని నియంత్రించే హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తినాలనిపించి, బరువు పెరిగి ఊబకాయం (Obesity) సమస్య తలెత్తుతుంది.
మనం నిద్రపోతున్నప్పుడు శరీరం రోగనిరోధక శక్తిని పెంచే సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే ఇమ్యూనిటీ తగ్గి.. జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా దాడి చేస్తాయి.
నిరంతరం నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది. దీనివల్ల టైప్-2 మధుమేహం (Diabetes) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
సరిపడా నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, డిప్రెషన్, తీవ్రమైన ఒత్తిడి, అలాగే మానసిక అశాంతి కలుగుతాయి. ఇది మీ రోజువారీ మూడ్‌ను పూర్తిగా పాడు చేస్తుంది.
పడుకునే గంట ముందు మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి. కెఫీన్ (టీ, కాఫీ) వాడకం తగ్గించండి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల వైద్య నిపుణులను సంప్రదించండి.