అరటిపండుతో బరువు తగ్గండిలా.. మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..

16 July 2026

Krishna

ఒక మీడియం సైజు అరటిపండులో దాదాపు 105 కేలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో 3 గ్రాముల వరకు ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

తక్కువ కేలరీలు

బాగా పండిన పండ్ల కంటే కాస్త పచ్చిగా ఉండే అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.

రెసిస్టెంట్ స్టార్చ్

బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తీసుకోవడం బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం. ఇది రోజంతా శరీరానికి కావలసిన తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఖాళీ కడుపుతో కాకుండా నట్స్‌తో లేదా ఓట్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది.

బ్రేక్‌ఫాస్ట్‌లో

జిమ్‌కు లేదా వర్కౌట్స్‌కు వెళ్లే 30 నిమిషాల ముందు అరటిపండు తినడం వల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అంది, వ్యాయామం చేయడానికి అవసరమైన అద్భుతమైన ఎనర్జీ లభిస్తుంది.

ప్రీ-వర్కౌట్ స్నాక్‌

సాయంత్రం పూట సమోసాలు, చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తినాలనిపించినప్పుడు.. వాటి స్థానంలో ఒక అరటిపండు తినడం వల్ల అనవసరపు కేలరీలు శరీరంలో చేరకుండా ఆకలిని సులభంగా అణచివేయవచ్చు.

జంక్ ఫుడ్ క్రేవింగ్స్‌

అరటిపండును ఒంటరిగా తినడం కంటే పీనట్ బటర్, బాదం పప్పులు లేదా పెరుగు వంటి ప్రోటీన్ వనరులతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఆకలిని దీర్ఘకాలం పాటు నియంత్రిస్తుంది.

ప్రోటీన్‌తో కలిపి 

బరువు తగ్గాలనుకునే వారు రోజుకు ఒకటి లేదా గరిష్టంగా రెండు అరటిపండ్లను మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే శరీరంలో కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగి బరువు తగ్గే ప్రక్రియ మందగిస్తుంది.

మితిమీరి తింటే 

బాగా పండిపోయి, పైన నల్లటి మచ్చలు వచ్చిన అరటిపండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి కాస్త పచ్చిగా ఉండే అరటిపండ్లనే ఎంచుకోవాలి.

అతిగా పండిన