బరువు తగ్గడమే కాకుండా యవ్వనంగా మార్చే అద్భుత పానీయం!

16 July  2026

Jyothi Gadda

ఇటీవలి కాలంలో గ్రీన్ టీ, బ్లాక్ టీల స్థానంలో బ్లూ టీ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీనిని మన ఇళ్లలో సాధారణంగా పూజా అవసరాల కోసం ఉపయోగించే అపరాజిత పూలు లేదా శంఖు పువ్వుల తో తయారు చేస్తారు. 

ఆకర్షణీయమైన నీలి రంగులో ఉండే ఈ హెర్బల్ టీ కేవలం ఒక సాధారణ డ్రింక్ మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సంజీవని లాంటిది. 

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్‌గా పనిచేస్తుంది.

బ్లూ టీలో ఉండే కేటచిన్స్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఇది మెటబాలిజం రేటును పెంచి, కేలరీలను వేగంగా కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త శుద్ధికి తోడ్పడతాయి. శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్లను తొలగించి, అంతర్గత అవయవాలను శుభ్రపరుస్తుంది.

అపరాజిత పూలలో లభించే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అలాగే ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరచి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

రోజంతా అలసిపోయిన వారికి ఈ టీ ఒక మంచి రిఫ్రెష్ డ్రింక్. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.

ఈ హెల్తీ బ్లూ టీ తయారీ కోసం  ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించండి. మరుగుతున్న నీటిలో 4 నుండి 5 ఎండిన లేదా తాజా శంఖు పూలను వేసి, స్టవ్ కట్టేయండి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. 

నీరు క్రమంగా నీలి రంగులోకి మారుతుంది. ఈ నీలి రంగు డికాక్షన్‌ను కప్పులోకి వడపోసుకోండి. ఇందులో రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇందులో విటమిన్‌ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.