AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.. పట్టిందల్లా బంగారమే..

శుక్రవారం రోజును లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున స్వచ్ఛమైన నెయ్యిలో బెల్లం ముంచి ఆవుకు తినిపిస్తే ఆర్థిక అభివృద్ధి, అదృష్టం, సంపద వృద్ధి కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి పవిత్రతకు, బెల్లం మాధుర్యానికి, ఆవు గోమాతగా పూజించబడటానికి ప్రతీకలుగా భావించబడటంతో ఈ పరిహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొంటున్నారు.

శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.. పట్టిందల్లా బంగారమే..
Friday Luck Remedy
Shaik Madar Saheb
|

Updated on: Jul 17, 2026 | 7:22 AM

Share

మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనేవి సర్వసాధారణం. అయితే, మన కృషికి తోడుగా కొన్ని సంప్రదాయబద్ధమైన పరిహారాలను ఆచరించడం ద్వారా అదృష్టాన్ని ఆహ్వానించవచ్చని మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తు శాస్త్ర నిపుణులు శుక్రవారం రోజున ఆచరించదగిన ఒక అద్భుతమైన, సులభమైన పరిహారాన్ని వివరించారు. శుక్రవారం రోజున కొన్ని ఈ పరిహారాల ద్వారా .. పట్టిందల్లా బంగారం అవుతుందని, ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని.. పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దేవుని గది శుభ్రత, ఇంటి శుభ్రత.. అలాగే.. పూజలు చేయడం లాంటివి చేయాలి.. వీటితోపాటు.. పలు పరిహారాలు ముఖ్యమైనవని పేర్కొంటున్నారు.

శుక్రవారం ప్రత్యేకత – పరిహారం

హిందూ సంప్రదాయంలో శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజలు, పరిహారాలు ఆర్థిక అభివృద్ధికి, సంపద వృద్ధికి దోహదపడతాయని నమ్మకం. అయితే.. రోజున చేయాల్సిన పరిహారాల గురించి పండితులు సూచించిన విషయం చాలా సులభం.. కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యిని తీసుకుని, అందులో బెల్లాన్ని ముంచి ఆవుకు తినిపించడం. ఈ ప్రక్రియను స్వయంగా తమ చేతులతో చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ జ్యోతిష్యురాలు సీతాశర్మ పేర్కొన్నారు.. నెయ్యి పవిత్రతకు, బెల్లం మాధుర్యానికి, సంపదకు ప్రతీకలుగా భావిస్తారు. ఆవును గోమాతగా పూజించడం మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి, ఈ మూడు అంశాల కలయిక శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

పరిహార ఆచరణ – ప్రయోజనాలు

ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రత్యేకమైన ఆడంబరాలు అవసరం లేదు. ఒక చిన్న ప్లాస్టిక్ పాత్రలో కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యిని తీసుకుని, అందులో చిన్న బెల్లం ముక్కను ముంచాలి. ఆ తరువాత, ఈ నెయ్యిలో తడిపిన బెల్లాన్ని ఒక ఆవు దగ్గరకు తీసుకువెళ్లి, మీ చేతులతో ప్రేమగా తినిపించాలి. అయితే, బెల్లాన్ని మరీ ఎక్కువ పరిమాణంలో కాకుండా, కొద్దిగా మాత్రమే ఇవ్వాలని సలహా ఇచ్చారు. అతిగా ఇవ్వడం వల్ల ఆవుకు హాని కలగవచ్చు లేదా దాని రుచికి వికారం కలగవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ పరిహారం ముఖ్య ప్రయోజనాలు:

ఆర్థిక బలం: ఈ ఆచారంతో ఆర్థికంగా బలం చేకూరుతుందని, సంపద వృద్ధి చెందుతుందని తెలిపారు.

అదృష్టం వరిస్తుంది: నిరంతరం అదృష్టం మీ వెంట ఉంటుందని, ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారని ఆమె పేర్కొన్నారు.

సంతోషకరమైన జీవితం: ఆర్థిక సమస్యలు తొలగిపోవడం వల్ల ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు

అయితే.. అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు, సుఖాలు జీవితంలో సహజం. అయితే, శుక్రవారం రోజు ఆచరించే ఈ చిన్న, శక్తివంతమైన పరిహారం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించి, ఆర్థిక వృద్ధిని, అదృష్టాన్ని సాధించవచ్చని పేర్కొంటున్నారు.

గమనిక:
ఇలాంటి పరిహారాలు సాంప్రదాయ, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి.. వీటిని నమ్మకాల ప్రకారం ఆచరించవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us