Michael Jackson: నెట్టింట ట్రెండ్ అవుతున్న మైఖేల్ జాక్సన్ సాంగ్.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?..
సింగర్, డ్యాన్సర్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. పాప్ సామ్రాజ్యానికి ఆయనే రారాజు. కానీ జీవితం మాత్రం ఎన్నో వివాదాస్పదాలతో ముగిసింది. లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేయడంతో ఆరోగ్యం దెబ్బతిని 2009లో జూన్ 25న 50 ఏళ్ల వయుసులో కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న తన నివాసంలో మృతిచెందారు మైఖేల్ జాక్సన్. అయితే ఇప్పటికీ ఆయన స్టెప్పులను ప్రయత్నించని డాన్స్, కొరియోగ్రాఫర్ ఉండరు. తన డ్యాన్స్‌తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాడు.
మైఖేల్ జాక్సన్.. ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన పేరు వింటే కోట్లాది మ్యూజిక్ లవర్స్ గుండెలు ఉప్పొంగుతాయి. సింగర్, డ్యాన్సర్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. పాప్ సామ్రాజ్యానికి ఆయనే రారాజు. కానీ జీవితం మాత్రం ఎన్నో వివాదాస్పదాలతో ముగిసింది. లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేయడంతో ఆరోగ్యం దెబ్బతిని 2009లో జూన్ 25న 50 ఏళ్ల వయుసులో కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న తన నివాసంలో మృతిచెందారు మైఖేల్ జాక్సన్. అయితే ఇప్పటికీ ఆయన స్టెప్పులను ప్రయత్నించని డాన్స్, కొరియోగ్రాఫర్ ఉండరు. తన డ్యాన్స్‌తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మైఖేల్ జాక్సన్ డాన్స్ వీడియో ఒకటి వైరలవుతుంది. అందులో తెల్లటి షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో మైఖేల్ పాప్ స్టెప్పులు వేస్తుండగా.. పక్కనే మరో అమ్మాయి భారతీయ సంస్కృతిలో పట్టుచీరలో సంప్రదాయ నృత్యం చేస్తుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ? అంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.
1991లో మైఖేల్ జాక్సన్ ‘బ్లాక్ ఆర్ వైట్’ అనే ఆల్బమ్‌ను రూపొందించాడు. జాతి వివక్షను మరచి అందరూ ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ పాట ప్రపంచంలోని అన్ని రంగుల వారిని ఆకట్టుకునేలా చిత్రీకరించారు. మైఖేల్ జాక్సన్ ఈ పాటలో ప్రపంచంలోని వివిధ వ్యక్తుల సంస్కృతిని చూపించారు. అందులో భారతీయ సంస్కృతిని చూపించారు. ఒడిస్సీ డ్యాన్సర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు జాక్సన్. అతడితో కలిసి డాన్స్ చేసిన అమ్మాయి పేరు యమునా శంకరశివం. ‘బ్లాక్ ఆర్ వైట్’ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ఆమె లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తుంది.
ఆధునిక సాంస్కృతిక నృత్యకారుల కోసం మైఖేల్ జాక్సన్ పిలుపు గురించి విన్న తర్వాత యమునా శంకరశివం ఆడిషన్ చేశారు. మొత్తం 3000 మంది ఆడిషన్ లో పాల్గొనగా.. ఆమె నృత్యానికి ముగ్దులైన మైఖేల్ యమునాను ఎంపిక చేశాడు. మైఖేల్ జాక్సన్ తో 20 నిమిషాల డ్యాన్స్ సీన్ ను 14 గంటల పాటు చిత్రీకరించారు. లాస్ ఏంజిల్స్ ఎక్స్‌ప్రెస్ లైన్ ఆ 14 గంటల పాటు పూర్తిగా మూసివేయబడింది. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేయడం గురించి ఒక ఇంటర్వ్యూలో యమునా మాట్లాడుతూ తను చాలా అదృష్టవంతురాలినని.. మైఖేల్ జాక్సన్ చాలా వినయపూర్వకమైన, దయగల స్వభావం కలిగి ఉంటాడని చెప్పింది.
అంతేకాదు.. సాంగ్ షూట్ కోసం మైఖేల్ జాక్సన్ తనను తీసుకెళ్లేందుకు మెర్సిడెస్ కారును పంపాడని, సెట్‌లో చలి ఎక్కువగా ఉండటంతో తన తల్లి కోసం ఓ దుప్పటి తీసుకొచ్చానని చెప్పింది. యమునా శంకరశివం ఉత్తర శ్రీలంకకు చెందినవారు. ఆమె అక్కడే పెరిగింది. 9 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో స్థిరపడింది. పాశ్చాత్య శాస్త్రీయ పియానో, తమిళ కర్ణాటక సంగీతం, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆమె ప్రస్తుతం ఆంత్రోపాలజీ ప్రొఫెసర్, న్యూయార్క్‌లోని నజరెత్ కాలేజీలో సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు.