Animal OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన ‘యానిమల్’.. ఎక్కడ చూడొచ్చంటే.. ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి..

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.900కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు సినీ క్రిటిక్స్ నుంచి

Animal OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన 'యానిమల్'.. ఎక్కడ చూడొచ్చంటే.. ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి..
Animal Movie OTT
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2024 | 3:55 PM

ఎట్టకేలకు పాన్ ఇండియా సినీ ప్రియుల ఎదురుచూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.900కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు సినీ క్రిటిక్స్ నుంచి ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పిటికీ అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు జనవరి 26న అర్దరాత్రి నుంచి యానిమల్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో మాత్రం కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ వెర్షన్ ను కాస్త పొడగించి విడుదల చేస్తామని గతంలో అన్నారు సందీప్ రెడ్డి. దాదాపు 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తామని అన్నారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది.

కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న సినిమా మొత్తం థియేట్రికల్ వెర్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది నెటిజన్స్.. ఓటీటీ వెర్షన్లో అన్ సీన్ ఫుటేజ్ చూపిస్తారని భావించారు. థియేట్రికల్ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు ఉండగా.. ఓటీటీలో 3 గంటల 24 నిమిషాలు ఉంది. కేవలం మూడు సీన్స్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది బీటౌన్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఈ సినిమాకు మ్యూజిక్ మరింత హైలెట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.