AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapta Sagaralu Daati -Side B OTT: ఓటీటీలోకి వచ్చేసిన రక్షిత్ శెట్టి సినిమా.. ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇందులో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించగా.. హేమంత్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ 'సప్త సాగరాలు దాటి-సైడ్ బీ' సినిమాను తీసుకువచ్చారు. గతేడాది నవంబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కన్నడతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సూపర్ హిట్ మూవీ.

Sapta Sagaralu Daati -Side B OTT: ఓటీటీలోకి వచ్చేసిన రక్షిత్ శెట్టి సినిమా.. 'సప్త సాగరాలు దాటి-సైడ్ బీ' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Sapta Sagaralu Dhaati Side B Movie
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2024 | 2:27 PM

Share

777 చార్లీ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఈ మూవీలో తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశాడు. ముందుగా కన్నడలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇటు తెలుగులోనూ రిలీజ్ చేయగా పర్వాలేదనిపించుకుంది. ఇందులో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించగా.. హేమంత్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ సినిమాను తీసుకువచ్చారు. గతేడాది నవంబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కన్నడతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సూపర్ హిట్ మూవీ.

ప్రస్తుతం ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై హీరో రక్షిత్ శెట్టి ట్వీట్ చేయగా.. ఇప్పుడు ఎలాంటి అనౌన్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఈ చిత్రాన్ని నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.

‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ కథ విషయానికి వస్తే.. తన భార్యతో కలిసి సంతోషంగా జీవించాలని.. అందుకు డబ్బు ఉండాలని నిర్ణయించుకున్న హీరో.. చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత అనుహ్యంగా అదే కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవిస్తాడు. అలా పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. తన ప్రేయసి ప్రియ (రుక్మిణి వసంత్)కు పెళ్లి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మన సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో తన గురించి చెప్పకుండా స్నేహం చేస్తాడు. ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తుంటాడు. చివరకు ప్రియను కలిశాడా ?.. అతని జీవితంలోకి వచ్చిన సురభి (చైత్ర జే ఆచార్) ఎవరు ? తనను జైలుకు పంపించిన వారిపై పగ తీర్చుకున్నాడా ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.