Pindam Movie: ఓటీటీలోకి భయంతో వణికించే ‘పిండం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..

ఈ సినిమాను గర్భిణీలు, చిన్నారులు చూడొద్దంటూ రిలీజ్ కు ముందే హెచ్చరించారు మేకర్స్. దీంతో ఈ మూవీ అంత భయంకరంగా ఉంటుందా ?.. అనే సందేహాలు.. ఇంతకీ ఈ హర్రర్ సినిమా ఎలా ఉంటుంది ? అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలయ్యింది. దీంతో థియేటర్లలో ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Pindam Movie: ఓటీటీలోకి భయంతో వణికించే 'పిండం'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..
Pindam OTT
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2024 | 9:22 PM

గతేడాది థియేటర్లలో ప్రేక్షకులను భయంతో వణికించిన సినిమా ‘పిండం’ ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 15న విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 2023లో విడుదలైన ది బెస్ట్ హర్రర్ సినిమా అనిపించుకుంది ఈ మూవీ. అయితే విడుదలకు ముందే విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటిని కలిగించారు మేకర్స్. ఈ సినిమాను గర్భిణీలు, చిన్నారులు చూడొద్దంటూ రిలీజ్ కు ముందే హెచ్చరించారు మేకర్స్. దీంతో ఈ మూవీ అంత భయంకరంగా ఉంటుందా ?.. అనే సందేహాలు.. ఇంతకీ ఈ హర్రర్ సినిమా ఎలా ఉంటుంది ? అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలయ్యింది. దీంతో థియేటర్లలో ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఏ ఓటీటీలోకి రాబోతుందని అనుకుంటున్నారా ?.. అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఈ సినిమా ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని దాని చుట్టూ ఓ కల్పిత కథాశం అల్లుకొని ఈ సినిమాను రూపొందించారు. ‘దియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఖుషి రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.

పిండం కథ విషయానికి వస్తే..

అన్నమ్మ (ఈశ్వరీరావు) తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక జ్ఞానంతో ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. ఆత్మలు ఆవహించినవారిని వాటి నుంచి విముక్తి కల్పిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్) అన్నమ్మ వద్దకు వస్తాడు. 1990ల నాటి ఓ సంఘటన గురించి అతడికి చెబుతుంది అన్నమ్మ. అదే ఆంథోనీ కుటుంబం కథ. ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పనిచేసే ఆంథోని (శ్రీరామ్) తన భార్య మేరీ (ఖుషి రవి), పిల్లలు సోఫి, తారలతో కలిసి ఊరి చివర ఉండే ఇంట్లోకి కొత్తగా వస్తారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఆంథోని కుటుంబాన్ని ఇబ్బందులు పెడతాయి. గర్భంతో ఉన్న మేరీ మినహా మిగిలిన అందరిని ఆవహిస్తాయి. ఎక్కడికి వెళ్లినా వారిని ఆత్మలు వదిలిపెట్టవు. చివరికి ఆంథోని కుటుంబం ఆ ఆత్మల నుంచి ఎలా విముక్తి పొందింది ?.. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి ?..ఆ ఇంట్లో ఏం జరిగింది ? అనేది ‘పిండం’ కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.