Srikanth : హీరో శ్రీకాంత్ కూతురు మేధ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ? ఫోటోస్ చూశారా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలలో శ్రీకాంత్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నారు. యంగ్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు హీరో శ్రీకాంత్. లవ్, ఫ్యామిలీ డ్రామాలతో జనాలను ఆకట్టుకున్నారు. అప్పట్లో వరుస హిట్లతో సత్తా చాటారు. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. యంగ్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ పోషిస్తున్నారు. మరోవైపు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరంగేట్రం చేశారు. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం రోషన్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రోషన్.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
ఇదిలా ఉంటే.. ఇప్పుడు శ్రీకాంత్ తనయ మేధా గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లారు శ్రీకాంత్. ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది మేధ. చీరకట్టులో సింపుల్ లుక్ లోనే ఎంతో అందంగా కనిపించింది. దీంతో ఆమె హీరోయిన్లకు మించిన అందంతో కట్టిపడేస్తుందని కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
అయితే మేధా ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ 4వ సంవత్సరం చేస్తుందని సమాచారం. తాను విదేశాల్లో చదువుకుని ఉద్యోగం చేస్తుందట. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి.. నటించాలనే ఇంట్రెస్ట్ తనకు లేవట. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సినిమా గురించి ఆలోచించనుందట. మేధ చిన్నప్పుడే నృత్యం నేర్చుకుంది. అలాగే ఆమె బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. ఆమె జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంది.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

Medha Meka
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..




