- Telugu News Photo Gallery Cinema photos Do You Know About Mirai Heroine Ritika Nayak, She Is Winning Hearts
Ritika Nayak: అప్పుడు నాని కూతురిగా కనిపించింది.. ఇప్పుడు మిరాయ్ సినిమాతో సెన్సేషన్.. రితికా నాయక్ గురించి తెలుసా.. ?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా మిరాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రితికా నాయక్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Updated on: Sep 13, 2025 | 10:23 PM

ప్రస్తుతం తేజ సజ్జా నటించిన మిరాయ్ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మంచు మనోజ్, శ్రియా కీలకపాత్రలు పోషించారు. అలాగే కథానాయికగా రితికా నాయక్ అదరగొట్టింది. అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. 27 అక్టోబర్ 1997న ఢిల్లీలోని ఒక మధ్యతరగతి ఒడియా కుటుంబంలో జన్మించింది ఈ అమ్మడు. ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించి, ఆపై మాస్టర్స్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరింది.

2019లో, రితిక ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 గెలుచుకుంది. ఆ తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2022లో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

2023లో హాయ్ నాన్న చిత్రంలో నాని కూతురి పాత్రలో కనిపించింది. ఇటీవల విడుదలైన తెలుగు ఫాంటసీ చిత్రం మిరాయ్‌లో కథానాయికగా కనిపించింది. ఇందులో విభ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు మేకర్స్.

మిరాయ్ చిత్రంలో తేజ సజ్జా, మంచు మనోజ్,శ్రియ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో జయరామ్, జగపతి బాబు, రాజేంద్రనాథ్ జుట్షి, పవన్ చోప్రా ముఖ్య పాత్రలలో కనిపించారు.




