Mammootty: అయ్యా బాబోయ్.. ఈ స్టార్ హీరో ఆస్తులు తెలిస్తే షాకే.. 400 పైగా సినిమాలు..

1951 సెప్టెంబర్ 7న జన్మించిన మమ్ముట్టి మలయాళీ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగుతోపాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం భాషలలో కూడా తనదైన ముద్ర వేశారు. మమ్ముటి నటవారసుడిగా దుల్కర్ సల్మాన్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

Mammootty: అయ్యా బాబోయ్.. ఈ స్టార్ హీరో ఆస్తులు తెలిస్తే షాకే.. 400 పైగా సినిమాలు..
Mammootty
Follow us

|

Updated on: Sep 12, 2024 | 2:34 PM

దక్షిణాది సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు మమ్ముట్టి. మలయాళీ చిత్రపరిశ్రమలో టాప్ హీరో.. అయినప్పటికీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. 50 ఏళ్లకు పైగా సినీరంగంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అద్భుతమైన నటనతో ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టి.. ఇప్పటికీ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. 1951 సెప్టెంబర్ 7న జన్మించిన మమ్ముట్టి మలయాళీ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగుతోపాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం భాషలలో కూడా తనదైన ముద్ర వేశారు. మమ్ముటి నటవారసుడిగా దుల్కర్ సల్మాన్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

మమ్ముట్టి 1971లో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. కానీ 1980లో మాత్రమే అతడి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించాడు. అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈరోజు మమ్ముట్టి నికర విలువ దాదాపు రూ. 340 కోట్లతో భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచాడు. కొచ్చి, బెంగళూరు, చెన్నై, దుబాయ్ వంటి ప్రధాన నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కొచ్చిలోని తన సొంత ఇల్లు, గ్రాండ్ బంగ్లా విలువ రూ. 4 కోట్లు. మమ్ముట్టి వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాడు, సాగు భూమిని కలిగి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మమ్ముట్టికి కార్లంటే ఎంత ఇష్టమో, నటనకు అంతే పేరుంది. అలాగే ఎన్నో లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. మమ్ముట్టి కార్ల నంబర్ పేట్స్ పై ‘369’ అనే నంబర్ ఉంటుంది. మమ్ముట్టి కార్ల గ్యారేజీని ‘369 గ్యారేజ్’ అని పిలుస్తారు. వీటిలో హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. BMW E46 M3Audi A7, మినీ కూపర్ SMercedes-Benz, పోర్స్చే కార్లను కలిగి ఉన్నాడు. ఈ మొత్తం కార్ కలెక్షన్స్ విలువ దాదాపు రూ.100 కోట్లు. ఒక్క సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. మమ్ముట్టికి వచ్చే ఆదాయం కేవలం సినిమాల ద్వారానే కాదు. యాడ్స్ ద్వారా సంపాదిస్తాడు. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు. మమ్ముట్టి టెక్నోడైనమిక్స్ యజమాని. థియేటర్లు, ఇతర హాస్పిటాలిటీ చైన్‌ల వంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడు.

View this post on Instagram

A post shared by Mammootty (@mammootty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.