AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Teja: నార్త్ అమ్మాయిలను హీరోయిన్లుగా సెలక్ట్ చేయడానికి కారణమదే.. డైరెక్టర్ తేజ కామెంట్స్..

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈక్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. నార్త్ అమ్మాయిలను హీరోయిన్లుగా సెలక్ట్ చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు.

Director Teja: నార్త్ అమ్మాయిలను హీరోయిన్లుగా సెలక్ట్ చేయడానికి కారణమదే.. డైరెక్టర్ తేజ కామెంట్స్..
Director Teja
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2023 | 4:14 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకులలో తేజ ఒకరు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలను రూపొందించిన ఆయన.. చాలా కాలం తర్వాత అహింస సినిమాన ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈక్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. నార్త్ అమ్మాయిలను హీరోయిన్లుగా సెలక్ట్ చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు.

తేజ మాట్లాడుతూ… “నా సినిమాల్లో తెలుగుమ్మాయిలనే హీరోయిన్లుగా పెట్టుకుందాం అని చాలాసార్లు అనుకున్నాను. ఒకసారి కొంతమంది ఫోటో షూట్స్ చేశాను.. లుక్ టెస్ట్స్ చేయించాను. కానీ ఒకటే సమస్య. తెలుగుమ్మాయిలకు ఓపిక తక్కువ. వాళ్ళకు నేను హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని ట్రై చేశా.. అందుకు 6 నెలలు ఆగమని చెప్పాను.. కానీ వాళ్లు అగలేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు తొందర పెట్టడం.. సోసైటీ కోసం భయపడటం వంటి కారణాలతో ఏదో ఒక చిన్న క్యారెక్టర్స్ చేస్తుంటారు. నాకు రెండు, మూడు సార్లు అలా జరిగింది. కేవలం అమ్మాయిలే కాదు.. తెలుగబ్బాయిలు కూడా అంతే.

ఇవి కూడా చదవండి

ఆరడుగులు చూడటానికి విలన్ పాత్రకు సెట్ అయ్యే విధంగా ఉంటారు. కానీ హీరో పక్కన నిలబడే పాత్రలు చేస్తుంటారు. అందుకే తెలుగమ్మాయిలకు అంతగా ఛాన్సులు రావు” అంటూ చెప్పుకొచ్చారు.