12 ఏళ్ల తర్వాత బృహస్పతి హంస మహా పురుష రాజ యోగం.. ఈ 3 రాశులకు లక్కు కిక్కు ఖాయం
12 ఏళ్ల తర్వాత బృహస్పతి సంచారం కారణంగా హంస మహా పురుష యోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కొన్ని రాశులకు రెట్టింపు అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీంతో ఆయా రాశులవారు పదోన్నతులు, గౌరవాన్ని పొందుతారు. అన్ని రకాలుగా వీరికి కలిసిరానుంది. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సంవత్సరంలో చిన్న, పెద్ద గ్రహాల సంచారం కారణంగా శుభ, రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ ప్రత్యేక యోగాలు మానవ జీవితంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి. ఇక, ఈ ఏడాది జూన్‌లో బృహస్పతి తన అత్యున్నత రాశి కట్కాటకంలో సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కారణంగా ఇది చాలా శక్తివంతమైన హంస మహా పురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం కొన్ని రాశులకు రెట్టింపు అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీంతో ఆయా రాశులవారు పదోన్నతులు, గౌరవాన్ని పొందుతారు.
12 ఏళ్ల తర్వాత బృహస్పతి సంచారం కారణంగా హంస మహా పురుష యోగం ఏర్పడబోతోంది. దీంతో మూడు రాశులవారికి మహా అదృష్టం కలగబోతోంది. అన్ని రకాలుగా వీరికి కలిసిరానుంది. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. వాటి గురించి తెలుసుకుందాం.
కన్యారాశి: బృహస్పతి హంస మహా పురుష రాజయోగాన్ని సృష్టించడంతో కన్యారాశి వారికి ఆదాయ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. బృహస్పతి మీ రాశి నుంచి 11 ఇంట్లో సంచరిస్తున్నందున ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరగవచ్చు. మీరు కొత్త మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. మీరు స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీ ద్వారా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మీకు గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ ఉన్నత స్థాయికి చేరుతుంది. వ్యాపారవేత్తలు పెద్ద వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు. కన్యారాశి వారికి వారి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు.
తులా రాశి: బృహస్పతి హంస మహాపురుష రాజయోగం ఏర్పడబోతున్నందున తులా రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాజయోగం మీ సంచార జాతకంలోని కర్మ ఇంట్లో ఏర్పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ పని, వృత్తిలో మంచి పురోగతిని చూస్తారు. పనిచేసేవారు కార్యాలయంలో వారి పనికి ప్రశంసలు పొందుతారు. ఈ రాశివారికి సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో భవిష్యత్ ప్రణాళికలు చాలా వ్యవస్తీకృతంగా, బలంగా కనిపిస్తాయి. సామాజిక సహకారం ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను సాధించగలరు. కొత్త వ్యాపారులు ప్రారంభించడానికి మంచి సమయం.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి హంస మహా పురుష రాజయోగంతో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాజయోగం మీ రాశి నుంచి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడబోతోంది. ఇక్కడ కుజుడు స్థానం చాలా బలంగా మారుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసివస్తుంది. మీరు కొన్ని మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు. ఈ కాలం ఆధ్యాత్మిక, వ్యక్తిగత వృద్ధికి సానుకూలంగా ఉంటుంది. సృజనాత్మక కార్యకలాపాలు, కళాత్మక ప్రయత్నాలలో మీరు విజయం సాధిస్తారు. ఈ సమయంలో ప్రయాణం లేదా కొత్త సంబంధాు కొత్త అవకాశాలను తెరుస్తాయి. మీకున్న మెరుగైన సృజనాత్మకతతో మీరు మీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీరు మానసికంగా స్థిరంగా ఉంటారు.
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
