AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulli Raju: బాబోయ్ బుల్లి రాజు.. ఏంట్రా బాబు నీ రెమ్యూనరేషన్.. అంతనా

సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన బుల్లిరాజు, ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. విక్టరీ వెంకటేష్ తనయుడిగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ బుల్లి నటుడు.. ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారూ చిత్రంతోనూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి అతను భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

Bulli Raju: బాబోయ్ బుల్లి రాజు..  ఏంట్రా బాబు నీ రెమ్యూనరేషన్.. అంతనా
Bulli Raju
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2026 | 4:00 PM

Share

గత ఏడాది  సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు బుల్లిరాజు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ తనయుడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ప్రేక్షకులను అలరించాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమను వ్యక్తపరిచే కొడుకు పాత్రలో బుల్లిరాజు ఇచ్చిన ఫెర్పామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తెచ్చిన ఫేమ్ ఇప్పుడు బుల్లిరాజుకు టాలీవుడ్‌లో భారీ డిమాండ్‌ను తీసుకువచ్చింది. అదే ఊపులో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నటించి ఈ సంక్రాంతికి కూడా సందడి చేశాడు బుల్లి రాజు. అయితే, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బుల్లిరాజు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. సినిమా బడ్జెట్‌ను బట్టి 50 నుంచి 75 లక్షల వరకు అతను పారితోషకం తీసుకుంటున్నాడట. ఈ మొత్తం చైల్డ్ ఆర్టిస్టుల మధ్య అత్యధిక రెమ్యూనరేషన్‌లలో ఒకటిగా చెబుతున్నారు. సాధారణంగా చిన్నారుల పాత్రలకు ఇంత పారితోషికం ఉండదు. కానీ బుల్లిరాజు అసాధారణమైన ప్రతిభను చూసిన నిర్మాతలు, ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడటం లేదని సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లుగా దర్శకుడు బుల్లి రాజు కోసం ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌లు రాసుకుని అతడ్ని సినిమాలో పెట్టుకుంటున్నారు. ఇచ్చిన రెమ్యూనరేషన్‌కు ఏ మాత్రం తగ్గకుండా నటిస్తూ.. కామెడీ పండిస్తూ దూసుకుపోతున్నాడు బుల్లిరాజు.

అయితే  తన పారితోషికంగురించి తనకు ఎలాంటి అవగాహన లేదని బుల్లిరాజు చెబుతున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన తండ్రి చూసుకుంటారని, తనే అన్నీ దగ్గరుండి చక్కబెడతారని వెల్లడించారు. జేబు ఖర్చుల విషయానికి వస్తే, నెలకు సుమారు రూ. 400 పాకెట్ మనీగా తీసుకుంటానని, వాటిని జాగ్రత్తగా ఒక డిబ్బీలో దాచుకుంటానని తెలిపాడు. స్కూల్‌కు వెళ్లేటప్పుడు షాపులు లేకపోవడం వల్ల బయట చిరుతిళ్లు కొనుక్కోవడం కుదరదని, ఏదైనా కావాలంటే ఇంట్లో చెబితేనే తీసుకొస్తారని చెప్పాడు. తాను అనవసరంగా డబ్బులు ఖర్చు చేయనని, బయట తిండ్లు కొంటే మనీ వేస్ట్ అవుతాయని నమ్ముతానని తెలిపాడు. చాక్లెట్‌లలో అయితే, డైరీ మిల్క్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అది మాత్రమే అప్పుడప్పుడు తింటానని రేవంత్ బుల్లి రాజు వెల్లడించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..