Prabhas : అడగ్గానే రూ.2 కోట్లు ఇస్తా అన్నారు.. ఆ విషయం చెప్పగానే ప్రభాస్ చెప్పిన మాట ఇదే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే రాజాసాబ్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు. తాజాగా డార్లింగ్ మంచి మనసు గురించి ఓ నటుడు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండగ సందర్భంగా రాజా సాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. జనవరి 9న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈమూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ పై అభిమానులకు తెగ నచ్చేసింది. కానీ ఈ మూవీ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు.
అలాగే సలార్ 2, కల్కి 2, రాజాసాబ్ 2 చిత్రాలు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. ఇదెలా ఉంటే.. ప్రభాస్ గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరో ఒక నటుడు బయటపెడుతూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి డార్లింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు శివాజీ రాజా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలు తెలియజేశారు. తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు.
ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఈవెంట్ కోసం ఎటువంటి డిస్కషన్ లేకుండా ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ గొప్పతనం అదని..మంచి పని కోసమే కదా డార్లింగ్.. తీసుకో అని ప్రభాస్ అన్నారని చెప్పుకొచ్చారు. దీంతో డార్లింగ్ మంచి మనసు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas, Shivaji Raja
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
