Actress: 19 ఏళ్ల వయసులోనే తోపు హీరోయిన్.. క్యాన్సర్ తో జీవితం తలకిందులు.. ఇన్నాళ్లకు రీఎంట్రీ..
తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి.. అగ్ర హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి... ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ హీరోయిన్ మాత్రం క్యాన్సర్ తో పోరాడి గెలిచి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది.

సినీరంగంలో స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. చిన్నవయసులోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ పలువురు నటీమణులు సినిమాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటి 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ క్యాన్సర్ వ్యాధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. కొన్నాళ్లపాటు క్యాన్సర్ తో పోరాటం చేసి గెలిచింది. ఆ హీరోయిన్ పేరు సోనాలి బింద్రే. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అందం, అమాయకత్వంతోపాటు సహజ నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రేమికుల రోజు సినిమాతో దక్షిణాదిలో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సోనాలి 19 సంవత్సరాల వయసులో మోడలింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 19 సంవత్సరాల వయసులో, ఆమె ‘ఆగ్’ (1994) చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె ఉత్తమ అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ‘దిల్‌జాలే’ (1996) వంటి విజయాల తర్వాత, ఆమె ‘సర్బరోష్’, ‘మేజర్ సాబ్’ హిట్స్ అందుకుంది.
2018 ఏడాది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.చిత్రనిర్మాత గోల్డీ బెహ్ల్‌ను వివాహం చేసుకుంది. వీరికి బాబు ఉన్నాడు. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న సోనాలి..క్యాన్సర్ బారిన పడింది. జూలై 2018లో, సోనాలి తనకు మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉందని ప్రకటించింది. ఆమె చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది. కీమోథెరపీ సమయంలో తీసిన ఫోటోలను, గుండు చేయించుకున్న తలతో ఉన్న చిత్రాన్ని కూడా ఆమె పంచుకుంది. ఆ సంవత్సరం తరువాత, క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
