మీ పిల్లలకు ఈ సిరప్ వాడుతున్నారా..వెంటనే బయట పడేయండి వీడియో
పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల్లో అలర్జీలు, ఆస్తమా,హై ఫీవర్ వంటి సమస్యల చికిత్సకు వాడే 'అల్మాంట్-కిడ్' సిరప్‌ను తక్షణమే వాడటం నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ మండలికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉందని.. ఇది ఆరోగ్యానికి హానికరమని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పొరపాటన కూడా ఈ సిరప్‌ను వాడొద్దని సూచించారు.
ఈ సిరప్ వాడకం వల్ల పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించవచ్చని, ఇది మూత్రపిండాల వైఫల్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ అనే సంస్థ తయారు చేసిన ఈ సిరప్‌లో కల్తీ జరిగినట్లు బెంగాల్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ డ్రక్ కంట్రోల్ అధికారులు ఈ సిరప్‌ను టెస్ట్ చేయగా అందులో మొతాదుకు మంచి ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తేలింది. దీంతో ఈ సిరప్ ఇప్పటికే ఎవరివద్దనైనా ఉంటే వెంటనే దాన్ని వినియోగించడం ఆపేయాలని సూచించారు. ఈ క్రమంలో ఔషధ నియంత్రణ మండలి అధికారులు తల్లిదండ్రులకు, మెడికల్ షాపుల యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. మీ పిల్లలకు ఈ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌ను వాడుతుంటే వెంటనే ఆపేయండి. ఇప్పటికే ఈ సిరప్ బాటిల్ మీ ఇంట్లో ఉంటే దానిని పారేయండి. మీ పిల్లలకు ఇప్పటికే ఈ సిరప్ ఇచ్చినట్లయితే, ముందు జాగ్రత్తగా ఒకసారి శిశువైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించడం మంచిదని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
మీ పిల్లలకు ఈ సిరప్ వాడుతున్నారా..వెంటనే బయట పడేయండి వీడియో
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు తీవ్ర చలి వీడియో
హిమాలయాల్లో 'సిక్కిం సుందరి'..ముప్పై ఏళ్లకు ఒక్కసారి..వీడియో
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
