AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివర్ కాదు.. చికెన్‌లోని ఈ పార్ట్ తింటే.. ఆ సమస్యలన్ని మటాషే! తెలిస్తే వెంటనే వండుకు తినేస్తారు..

Skin-on chicken benefits: ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ చికెన్ షాప్‌లకు క్యూ కడుతారు. అందులో కొందరు స్కీన్ లెస్ చికెన్ తీసుకుంటే మరికొందరు విత్‌ స్కిన్ ఉన్న చికెన్‌ తీసుకెళ్లి.. దాన్ని నిప్పులపై కాల్చుకొని కూర వండుకొని తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది తినడం మంచిది. దేని వల్ల ఎక్కవ ప్రయోజనాలు ఉన్నాయి, దేని వల్ల నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్ కాదు.. చికెన్‌లోని ఈ పార్ట్ తింటే.. ఆ సమస్యలన్ని మటాషే! తెలిస్తే వెంటనే వండుకు తినేస్తారు..
Skin On Chicken Benefits (1)
Anand T
|

Updated on: Jan 14, 2026 | 4:34 PM

Share

మాంసాహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు నాన్‌ వెజ్ తినేందుకు ఇష్టపడుతారు. ఇందులో చికెన్ లవర్స్ అయితే సరపరేటు. వీరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అందుకే చికెన్ షాప్‌కు వెల్లి తమకు కావాల్సిన పార్ట్‌లను ఏరికొరి మరీ తెచ్చుకుంటారు. వీరితో కొందరు స్కిన్ లెస్ కోరుకుంటే.. మరీ కొందరు స్కిన్ ఉన్న చికెన్ తీసుకుంటారు. అయితే చాలా మందిలో ఉండే అపోహ ఏమిటంటే స్కిన్ ఉన్న కోడి తినడం ఆరోగ్యమేనా అని.. అయితే స్కిన్ చికెన్ చెడ్డదేం కాదని.. అలాగని పూర్తిగా మంచిది కూడా కాదని నిపుణులు చెబుతున్నారు.

స్కిన్ ఉన్న చికెన్ తినడం మంచిదేనా?

కోడి చర్మంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు-యుఎఫ్‌ఏలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు చికెన్ స్కిన్‌లో ప్రోటిన్, కాలజెన్ కూడా ఉంటాయి. ఇవి కండరాలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వీటి గురించి తెలియకుండా జనాలు రుచికోసమని స్కిన్‌లెస్ కోడిని తినాలనుకుంటారు. అయితే ప్రయోజనాలు ఉన్నాయి కదా అని.. స్కిన్ చికెన్ ఎక్కువ తిన్నా ప్రమాదమే.. ఎందుకంటే కోడి స్కిన్‌లో అధిక కెలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం ప్రారంభమవుతాయి. కాబట్టి స్కిన్ చికెన్‌ను మితంగా తింటూ ఆరోగ్యంగా ఉండండి.

స్కిన్‌లెస్‌ చికెన్ ప్రయోజనాలు, దీనిలో ఈ పార్ట్ బెస్ట్ అంటే?

చికిన్ తినే చాలా మంది లివర్ తినడం వల్ల ఎక్కవ ప్రయోజనాలు ఉన్నాయనుకుంటారు. కానీ వాటి కంటే చికెన్ బ్రెస్ట్ తినడమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కావాల్సినంత కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. అలాగే ఇందులో కండరాల పెరుగుదల, శరీర కణాల నిర్వహించే అధిక ప్రొటీన్ కూడా ఉంటుందని.. స్కిన్ లేకపోవడం వల్ల కేలరీలు కూడా తక్కువగా ఉంటాయని.. దీని వల్ల వెయిట్‌ లాస్ అవ్వాలనుకునే వారికి స్కిన్ లెస్ చికెనన్ మంచి ఎంపికని అంటున్నారు.

వండె పద్దతి ముఖ్యం

చికెన్ తినడం వల్ల మనకు ఆనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అవి.. దాన్ని ఎలా వండుతున్నామనే దానిపై ఆదారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు చికెన్ తినాలనుకుంటే ఎప్పుడూ ఫ్రెష్‌గానే తెచ్చుకోండి. అలాగే వండెప్పుడు చికెన్‌ను పూర్తిగా ఉడకనివ్వండి. చికెన్ సరిగ్గా ఉడకకపోతే అందులో బాక్టీరియాల ఏర్పడుతుంది. దీని వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే డీప్‌ఫ్రైలను తినడం మానుకోండి. లేకపోతే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.