AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కర్ లీకేజ్ సమస్యకి ఇక శాశ్వత పరిష్కారం.. ఇదే ఫైనల్ సొల్యూషన్!

నేటి బిజీ జీవితంలో ప్రెషర్ కుక్కర్ అవసరం చాలా ఉంది. అయితే, వంట చేసేటప్పుడు కుక్కర్ నుండి నీరు లీక్ అవ్వడం సాధారణ సమస్య. ఇది వంటింట్లో పనిభారాన్ని పెంచుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. కుక్కర్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, రబ్బర్, ప్రెషర్ రెగ్యులేటర్ వంటి భాగాలను తనిఖీ చేయడం, మూతను సరిగ్గా అమర్చడం ద్వారా ఈ లీకేజీ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.

కుక్కర్ లీకేజ్ సమస్యకి ఇక శాశ్వత పరిష్కారం.. ఇదే ఫైనల్ సొల్యూషన్!
Cooker Water Leakage
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2026 | 3:32 PM

Share

నేటి బిజీ జీవితంలో దాదాపు అందరూ ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగిస్తున్నారు. వంటను సులభంగా, త్వరగా పూర్తి చేయడానికి కుక్కర్ చాలా అవసరం. కానీ, కొన్నిసార్లు పప్పు లేదా బియ్యం వండేటప్పుడు ప్రెషర్ కుక్కర్ నుండి నీళ్లన్నీ బయటకు వస్తాయి. దీంతో వంటింట్లో పరిస్థితి మరింత దిగజారిపోతుంది. దీని వలన సులభంగా ఉండాల్సిన పని రెట్టింపు అవుతుంది. ప్రెజర్‌ కుక్కర్‌ వాటర్‌ లీకేజీ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సింపుల్‌ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

వంట చేసేటప్పుడు కుక్కర్‌ను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పప్పులు వండటం, అన్నం వండటం వంటివి చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు వంట చేసేటప్పుడు కుక్కర్ విజిల్ నుండి నీరు లీక్ అవుతుంది. దీనివల్ల పనిభారం పెరుగుతుంది. దీనిని నివారించడానికి వంట తర్వాత ప్రెజర్ కుక్కర్‌ను బాగా కడగాలి. స్టీమ్ వాల్వ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

కుక్కర్‌లో వంట చేసేటప్పుడు దానిలో నాలుగో వంతు ఖాళీగా ఉండేలా చూసుకోండి. అలాగే, రబ్బరు కూడా ప్రెజర్ కుక్కర్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ వాల్వ్ దెబ్బతిన్నట్లయితే కుక్కర్ నుండి నీరు లీక్ కావచ్చు. దీనితో పాటు, ప్రెజర్ కుక్కర్ మూతను గట్టిగా, సురక్షితంగా అమర్చాలి. అది వదులుగా ఉంటే లేదా తప్పుగా అమర్చినట్లయితే కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

కుక్కర్ లోపల ప్రెజర్ రెగ్యులేటర్ ఉంది. ఇది ప్రెజర్ ని నియంత్రిస్తుంది. అది పాడైపోయినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది. కాబట్టి దానిని క్రమం తప్పకుండా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. అది మురికిగా ఉంటే దానిని శుభ్రం చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..