Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vazhakku Movie: ఆ స్టార్ హీరోతో గొడవ.. సినిమా మొత్తం ఆన్‏లైన్‎లో లీక్ చేసిన డైరెక్టర్..

ఈ మూవీ రూపొందిస్తున్న సమయంలోనే ట్విస్టులు, వివాదాలు నెలకొన్నాయి. నిజానికి 2021లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు థియేటర్లలో రిలీజ్ కానుంది. అందుకు కారణం డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్, హీరో టోవినో థామస్ మధ్య ఉన్న గొడవలే. వీరిద్దరి మధ్య వజక్కు సినిమా విషయంలో గొడవలు జరిగాయి. ఇన్నిరోజులు వెయిట్ చేసిన డైరెక్టర్ శశిధరన్ ఇప్పుడు ఆకస్మాత్తుగా సినిమా మొత్తాన్ని ఆన్‏లైన్‎లో లీక్ చేశారు. దీంతో అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Vazhakku Movie: ఆ స్టార్ హీరోతో గొడవ.. సినిమా మొత్తం ఆన్‏లైన్‎లో లీక్ చేసిన డైరెక్టర్..
Vajakku Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2024 | 9:10 PM

మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు టోవినో థామస్. ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఈ హీరోకు ఓ డైరెక్టర్ షాకిచ్చారు. ప్రస్తుత టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా వజక్కు. ఈ మూవీ రూపొందిస్తున్న సమయంలోనే ట్విస్టులు, వివాదాలు నెలకొన్నాయి. నిజానికి 2021లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు థియేటర్లలో రిలీజ్ కానుంది. అందుకు కారణం డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్, హీరో టోవినో థామస్ మధ్య ఉన్న గొడవలే. వీరిద్దరి మధ్య వజక్కు సినిమా విషయంలో గొడవలు జరిగాయి. ఇన్నిరోజులు వెయిట్ చేసిన డైరెక్టర్ శశిధరన్ ఇప్పుడు ఆకస్మాత్తుగా సినిమా మొత్తాన్ని ఆన్‏లైన్‎లో లీక్ చేశారు. దీంతో అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మొత్తానికి హీరో, డైరెక్టర్ మధ్య గొడవతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వజక్కు చిత్రాన్ని డైరెక్టర్ శశిధరన్ ‘విమియో’ వీడియో ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేశాడు. కొందరు దీన్ని డౌన్‌లోడ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. మొత్తానికి న‌టుడు, ద‌ర్శ‌కుడి మ‌ధ్య పోరుతో థియేటర్లు లేక ఓటీటీలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దీనికి ముందు టొవినో థామస్, సనల్ కుమార్ శశిధరన్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

టోవినో థామస్, సనల్ కుమార్ శశిధరన్ మధ్య ‘వలక్కు’ సినిమా విడుదల విషయంలో మొదటి నుంచి విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య గొడవ ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. గతంలో వజక్కు సినిమాను థియేటర్లలో విడుదల చేసే విషయంలో టోవినో థామస్ ఒప్పుకోవడం లేదని డైరెక్టర్ శశిధరన్ ఆరోపించాడు. తన కెరీర్ పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలో, ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నాడని అన్నాడు డైరెక్టర్. 2020లో షూటింగ్ కంప్లీట్ అయిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ కాలేదని అన్నారు శశిధరన్. అయితే డైరెక్టర్ తనపై చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు టోవినో థామస్. తన కజిన్, సహ నిర్మాత గిరీశ్ చంద్రన్ కలిసి ఇన్ స్టాలో లైవ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 27 లక్షలు ఖర్చు చేశామని.. కానీ ఎలాంటి రాబడి రాలేదని అన్నారు. సినిమా రిలీజ్ కాకపోవడానికి డైరెక్టర్ శశిధరన్ కారణమని అన్నారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు డైరెక్టర్ ఒప్పుకోలేదని అన్నారు. అలాగే క్రియేటివ్ హక్కులను అప్పగించేందుకు కూడా శశిదర్ సిద్దంగా లేడని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !