RGV Tweet: ప్రభుత్వాలు ఫార్మా కంపెనీలకు ఫండ్స్ ఇవ్వడం మానేసి.. ఆనందయ్యకు ఇవ్వాలి! వర్మ మార్క్ కామెంట్స్..
RGV Tweet On Anandayya Medicine For Corona: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనాకు ఆయుర్వేద మందుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద ఔషధం హాట్ టాపిక్‌గా మారింది...
RGV Tweet On Anandayya Medicine For Corona: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనాకు ఆయుర్వేద మందుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద ఔషధం హాట్ టాపిక్‌గా మారింది. వేలాది మంది ఈ ఔషధం కోసం క్యూ కడుతున్నారు. ప్రజల్లో విపరీతమైన ప్రాముఖ్యత ఏర్పడిన నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై శాస్త్రీయ నిర్థారణ చేయించాలని ఏకంగా సీఎం జగన్ నిర్ణయించారు. నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపించి ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించడం విశేషం. ఇదిలా ఉంటే సమాజంలో జరిగే ప్రతీ సంఘటనపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ ఆయుర్వేద మందుపై కూడా తనదైన శైలిలో స్పందించారు. వరుస ట్వీట్లతో హంగామా చేశారు. ప్రభుత్వాలు ఇకపై భారత్ బయోటెక్, పూనావాలా, స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్ కంపెనీలకు నిధులు ఇవ్వడం మానేసి ఆనందయ్యకు ఇవ్వాలి అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు వర్మ. ఇక అంతటితో ఆగకుండా.. ఒకవేళ ఐసీఎమ్ఆర్ ఆనందయ్య చికిత్సకు ఓకే చెబితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నెల్లూరులో వాలిపోతుందా.? జస్ట్ అడుగుతున్నాను అంటూ చమత్కరించారు. ఇక ఓవైపు ఆనందయ్యకు మద్ధతుగా ట్వీట్‌లు చేస్తూనే మరోవైపు పలు ప్రశ్నలు సైతం స్పందించారు. ఆయుర్వేద మందు ముక్కులో, నోటిలో, చివరికీ చెవిలో వేయడానికి నేను ఒప్పుకుంటాను.. కానీ కళ్లకు, ఊపిరితిత్తులకు మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ రాసుకొచ్చారు. ఏది ఏమైనా వర్మ చేసిన ట్వీట్లు ఓ వైపు నవ్వులు తెప్పిస్తోన్నా.. మరోవైపు ఆలోజింపచేస్తున్నాయి కూడా.
వర్మ చేసిన ట్వీట్లు..
Hey Sir ANANDAYYA ji, Am ok with mouth , nose and even ears, but I am so zapped with what’s the connection of the eyes with Lungs ..Just asking ! pic.twitter.com/g39tIb5AUV
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2021
So will the government now stop the transfer of funds to Bharat biotech , poonawala ,Sputnikwaka etc and divert them to Anandayya..Just asking !
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2021
If ICMR gives a positive on ANANDAYYA ‘S treatment, will @WHO scientists be parashootng on Nellore districts,Krishna. Pattananam ..Just asking ?
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2021
Also Read: ఏపీ: ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
BA Raju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత
Viral Video: ఒంటి పై తేనెటీగలతో నటి ఫోటో షూట్.. ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..