BA Raju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత

BA Raju Died: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి

BA Raju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత
Ba Raju
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 22, 2021 | 1:52 AM

BA Raju Died: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించిన బీఏ రాజు.. చాలా మంది అగ్ర నటులకు పీఆర్‌ఓగా వ్యవహరించారు. దీంతోపాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. సూపర్ హిట్ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా, నిర్వాహకుడిగా వ్యవహరించారు.

కాగా.. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. రెండేళ్ల క్రితయం బీఏ రాజు భార్య.. దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు.

Also Read:

Uganda Prostitution Racket: కోరుకున్న చోటుకు యువతులు.. ఆన్‌లైన్ వ్యభిచార ఉగాండా ముఠా గుట్టు రట్టు!

Air India: ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్.. ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల మంది డేటా చోరీ..