Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో తటస్థంగానే పసిడి రేట్లు..
Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు
Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు శనివారం బ్రేక్ పడింది. అయితే.. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్కెట్ ప్రకారం.. హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు చూస్తుంటారు. దేశంలో కరోనా ఉధృతి ఉన్నా.. బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. ప్రస్తుతం 45 వేల మార్క్ దాటాయి. తాజాగా బంగారం ధరలకు బ్రేక్ పడింది. కొన్ని చోట్ల తటస్థంగానే ఉండగా.. మరికొన్ని చోట్ల తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.46,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి… హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,750 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 46,930 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,830 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,750 వద్ద ఉంది. చెన్నైలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,020 వద్ద కొనసాగుతోంది.
Also Read: