Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్.. ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల మంది డేటా చోరీ..

Air India servers hacked: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్ అయ్యాయి. దీంతో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగినట్టు ఎయిర్ ఇండియా

Air India: ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్.. ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల మంది డేటా చోరీ..
Air India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 21, 2021 | 10:48 PM

Air India servers hacked: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్ అయ్యాయి. దీంతో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగినట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందని ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. ప్రయాణికులకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్టు, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ తదితర వివరాలన్నీ లీకైనట్లు ప్రకటించింది. డేడా చోరీకి గురైన వారిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది.

2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించిన డేటా హ్యాకింగ్ జరిగినట్టు నిర్ధారించారు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యామని ఎయిర్ ఇండియా తెలిపింది. వెంటనే డేటా భద్రతకు సంబంధించిన పాస్‌వర్డ్స్ ను రీసెట్ చేసినట్లు తెలిపింది.

Also Read:

Anandaiah issue: ఆయుర్వేద ఆనందయ్య అరెస్ట్.. అంటూ సోషల్ మీడియా వార్తలు.. స్పందించిన ఎస్పీ, ఎమ్మెల్యే

Viral Video : రాఫెల్ జెట్ విమానం.. స్పోర్ట్స్ కారు మధ్య రేస్..! ఏది గెలిచిందో చూడండి..? వైరల్‌గా మారిన వీడియో..