ఏపీ: ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

Government Offices Timings AP: ఏపీలో కర్ఫ్యూను ఈ నెలాఖరు దాకా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపధ్యంలో...

ఏపీ: ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
AP-Government-
Follow us
Ravi Kiran

|

Updated on: May 22, 2021 | 7:05 AM

Government Offices Timings AP: ఏపీలో కర్ఫ్యూను ఈ నెలాఖరు దాకా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపధ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పును సైతం ఈ నెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధిత్యనాధ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉండటంతో రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్‌, జిల్లా కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కాగా, అత్యవసర సర్వీసులకు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!