AP Doctor Sudhakar Died: వైసీపీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేసిన డాక్ట‌ర్ సుధాక‌ర్ మ‌ర‌ణం.. కార‌ణం అదేనంటూ ఆరోప‌ణ‌..

AP Doctor Sudhakar Died: గ‌తేడాది విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుడు సుధాక‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఆసుప‌త్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వ‌లేద‌ని..

AP Doctor Sudhakar Died: వైసీపీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేసిన డాక్ట‌ర్ సుధాక‌ర్ మ‌ర‌ణం.. కార‌ణం అదేనంటూ ఆరోప‌ణ‌..
Doctor Sudhakar
Follow us

|

Updated on: May 22, 2021 | 6:47 AM

AP Doctor Sudhakar Died: గ‌తేడాది విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుడు సుధాక‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఆసుప‌త్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతూ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశారు మ‌త్తు వైద్య నిపుణుడు సుధాక‌ర్‌. ఇలా ప్ర‌శ్నించినందుకునే త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని సుధాక‌ర్ చేసిన కామెంట్లు అప్ప‌ట్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా సుధాక‌ర్ శుక్ర‌వారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుంటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు. గ‌తేడాదిలో సుధాక‌ర్‌ను స‌స్పెండ్ చేసిన ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ విధుల్లోకి తీసుకోలేదు. అత‌ని మాన‌సిక ప‌రిస్థితి బాగాలేద‌ని కొన్ని రోజులు విశాఖ‌లోని మాన‌సిక ఆసుప‌త్రిలో చికిత్స అందించారు. దీంతో బాధితుడి కుటుంబ స‌భ్యులు హైకోర్టునుఆశ్ర‌యించారు. ఈ కేసును కోర్టును సీబీఐకి అప్ప‌జెప్పింది. ఇక మ‌రికొన్ని రోజుల్లోనే తీర్పు రావాల్సి ఉండ‌గా సుధాకర్ హ‌ఠాన్మ‌ర‌ణం పొందారు. విధుల్లోకి తీసుకోక‌పోవ‌డంతోనే సుధాక‌ర్ మ‌నోవేద‌న‌కు గుర‌య్యార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. విశాఖ‌లోని సీత‌మ్మ‌ధార‌లో ఉన్న స్వ‌గృహంలో మృతి చెందిన సుధాక‌ర్‌, అంతిమ సంస్కారాలు పూర్త‌యినట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెప్పుకొచ్చారు.

ఇది ప్ర‌భుత్వ హ‌త్య‌..

ఇక డాక్ట‌ర్ సుధాక‌ర్ మృతి ప‌ట్ల టీడీపీ నాయ‌కుడు లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ చేస్తూ.. డాక్టర్ సుధాకర్ గారి మృతి న‌న్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. మాస్క్ అడగ‌డ‌మే ద‌ళిత వైద్యుడు చేసిన నేరంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఆదేశాల‌తో రెక్కలు విరిచి క‌ట్టి, కొట్టి, నానా హింస‌లు పెట్టి పిచ్చాసుప‌త్రిలో చేర్పించ‌డంతో సుధాక‌ర్ బాగా కుంగిపోయార‌ని తెలిసింది. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివ‌రికి ఇలా అంత‌మొందించారు. ఇది గుండెపోటు కాదు. ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హ‌త్య ఇది. నిరంకుశ స‌ర్కారుపై పోరాడిన సుధాక‌ర్‌ గారికి నివాళి అర్పిస్తున్నాను. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను.’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు లోకేష్.

లోకేష్ చేసిన ట్వీట్‌..

Also Read: Karnataka Lockdown: యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పొడిగింపు

Hyderabad: యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్.. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు..

KTR – Shashi Tharoor: కరోనా ఔషధాల పేర్లపై.. కేటీఆర్ ఫన్నీ ట్విట్.. శశి థరూర్ ఏమన్నారో తెలుసా..?