KTR – Shashi Tharoor: కరోనా ఔషధాల పేర్లపై.. కేటీఆర్ ఫన్నీ ట్విట్.. శశి థరూర్ ఏమన్నారో తెలుసా..?
Shashi Tharoor - KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సరదా ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంత్రి ట్విట్‌కు శశిథరూర్ ఇచ్చిన కౌంటర్ ట్విట్ ప్రస్తుతం అంతటా

Shashi Tharoor – KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సరదా ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంత్రి ట్విట్‌కు శశిథరూర్ ఇచ్చిన కౌంటర్ ట్విట్ ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు మంత్రి కేటీఆర్ ఎందుకు, ఏం ట్విట్ చేశారు.. శశిథరూర్ ఏమని స్పందించారు.. ఇవన్నీ ఇప్పుడు చూద్దాం.. కరోనావైరస్ ప్రారంభం నాటి నుంచి ఎప్పుడూ వినని పదాలను కూడా అందరం వింటున్నాం. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే ఔషధాల పేర్లు నోరుతిరగనంత కష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఇలాంటి అభిప్రాయాన్నే తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ.. శశిథరూర్‌కి ట్యాగ్ చేశారు. ఈ పేర్లు పెట్టడంలో శశిథరూర్ పాత్ర ఉండొచ్చంటూ ఆయన ఫన్నీ ట్విట్ చేశారు. పోసాకోనాజోల్, క్రెసెంబా, టోసిలిజుమాబ్, రెమ్ డెసివివర్, బారిసిటినిబ్, ఫ్లావిపిరావిర్, మోల్నుపిరావిర్, లిప్సోమాల్ ఆంఫోటెరెసిన్ వంటి ఔషధాల పేర్లను కేటీఆర్ ఉదహరిస్తూ… ఇలాంటి కఠిన పేర్లను ఔషధాలకు ఎందుకు పెడతారంటూ ప్రశ్నించారు. అయితే.. ఇంతటి క్లిష్టమైన పేర్లను ఔషధాలకు పెట్టడంలో శశిథరూర్ పాత్ర ఉండొచ్చంటూ కేటీఆర్ ఫన్నీగా ట్వీట్ చేశారు.
అయితే.. ఇంగ్లీష్‌పై ఎంతో పట్టున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేటీఆర్ ట్విట్‌కు సరదాగా స్పందించారు. ఔషధాలకు పేర్లు పెట్టడంలో తప్పేమీలేదు… అయినా ఇలాంటి విషయాలు మీకెందుకు? నేను చూసుకుంటాగా నాకు వదిలేయండి.. అంటూ ట్వీట్ చేశారు. ‘‘కరోనిల్, కరోజీరో, గో కరోనా గో’’… అంటూ ఆనందంగా పిలుచుకుంటాను.. అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో థరూర్ తనదైన శైలిలో floccinaucinihilipilification టంగ్ ట్విస్టర్ పదాన్ని ప్రయోగించారు.
Not guilty! How can you indulge in such floccinaucinihilipilification, @KTRTRS? Left to me I’d happily call them “CoroNil”, “CoroZero”, & even “GoCoroNaGo!” But these pharmacists are more procrustean…. https://t.co/YrIFSoVquo
— Shashi Tharoor (@ShashiTharoor) May 21, 2021
ఈ ట్విట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘ద్యేవుడా… ఇప్పుడో డిక్షనరీని బయటికి తీయాల్సి వచ్చేట్టుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ‘కరోనిల్’ అంటూ మీరు ప్రదర్శించిన వెటకారాన్ని బాగా ఇష్టపడుతున్నా అంటూ కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా.. కరోనిల్ ఔషధాన్ని బాబా రాందేవ్ పతంజలి గ్రూప్ తయారుచేసింది. ‘గో కరోనా గో’ అనే నినాదాన్ని కరోనా ప్రారంభంలో బీజేపీ నేతలు ఎక్కువగా ఉపయోగించిన విషయం తెలిసిందే.
? Devudaaaa…..had to pull out a dictionary & Tharoorosaurus to comprehend
P.s: loved the Coronil dig ? https://t.co/V63zmc7suF
— KTR (@KTRTRS) May 21, 2021
Also Read: