Rajamouli: SSMB 29 గ్రాండ్ ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ.. వీడియో షేర్ చేసిన రాజమౌళి..
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాలలో SSMB229. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు వరుస పోస్టర్లతో ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు జక్కన్న. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB 29. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మహేష్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్స్ రిలీజ్ కాగా.. ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 15న రామెజీ ఫిల్మ్ సిటీలో సాయంత్రం 6 గంటలకు గ్లోబల్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వేడుక గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ వీడియో రిలీజ్ చేశారు జక్కన్న.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
నవంబర్ 15న జరగబోయే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చెప్తూ దర్శకుడు రాజమౌళి ఓ వీడియో విడుదల చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ ఈవెంట్‌కు చాలా కండీషన్స్ ఉన్నాయని.. ఫిజికల్ పాసెస్ ఉంటే తప్ప వేడుకకు రావద్దంటూ స్ట్రిక్ట్‌గా చెప్పారు దర్శక ధీరుడు. అంతేకాదు పాసుల మీద ఉన్న QR కోడ్ డౌన్ లోడ్ చేసుకుంటే.. ఇన్‌స్ట్రక్షన్స్‌తో పాటు రూట్ మ్యాప్ కూడా ఉంటుందని తెలిపారు రాజమౌళి. 18 ఏళ్ల లోపు పిల్లలు, సీనియర్ సిటిజన్లకు ఈ ఈవెంట్‌కు రావడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. వాళ్లు ఇంట్లోనే కూర్చుని ఈవెంట్ ఎంజాయ్ చేయాలని తెలిపారు రాజమౌళి. ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని కమీషనర్ చెప్పినట్లు వీడియోలో చెప్పుకొచ్చారు జక్కన్న.
వీడియో చూడండి..
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..








