AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli : సూర్యతో ఆ సినిమా చేయాలనుకున్న రాజమౌళి.. ఎలా మిస్సైందంటే..

సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటివరకు జక్కన్న చేసిన సినిమాలన్ని హిట్టే. అందుకే జక్కన్న డైరెక్షన్లో నటించాలని ఎంతో మంది తారలు కలలు కంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ గడ్డపై నిలబెట్టాడు రాజమౌళి.

Rajamouli : సూర్యతో ఆ సినిమా చేయాలనుకున్న రాజమౌళి.. ఎలా మిస్సైందంటే..
Suriya, Rajamouli
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2024 | 9:11 PM

Share

భారతీయ సినీరంగంలో డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఆఫర్ ఇస్తే తిరస్కరించే వారు చాలా తక్కువ. అలాంటింది ఓ స్టార్ హీరోతో జక్కన్న సినిమా చేయాలనుకున్నారట. కానీ ఎందుకో వీరిద్దరి కాంబో మిస్సైందంట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందమా. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. నవంబర్ 14న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. ఈవేడుకకు ఎస్ఎస్ రాజమౌళి అతిథిగా విచ్చేశారు. అలాగే నటుడు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత అల్లు అరవింద్ సందడి చేశారు. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. “బాహుబలి సినిమా చేయడానికి సూర్యనే ఇన్‏స్పిరేషన్. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. అయితే కుదరలేదు” అని అన్నాడు. వెంటనే సూర్య మైక్ అందుకుని.. “సర్ నేను ట్రైన్ మిస్సయాను.. ఇప్పటికీ రైల్వే స్టేషన్ లోనే నిల్చొని ఉన్నాను. ఏదో ఒక రోజు ట్రైన్ ఎక్కుతాననే నమ్మకం ఉంది” అంటూ రాజమౌళి సినిమా గురించి మాట్లాడాడు. ఇక ఇప్పుడు వీరిద్దరి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఇప్పుడు రాజమౌళి, సూర్య కాంబోలో మిస్ అయిన సినిమా ఏదీ అంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా మగధీర అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం సూర్య నటించిన కంగువ మూవీ నవంబర్ 14న అడియన్స్ ముందుకు రానుంది. అలాగే జక్కన్న కొన్ని రోజులుగా మహేష్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.